రివోల్ట్ బైక్కు కొత్త ఫీచర్ల
కీ అవసరం లేకుండా స్వైప్ టూ స్టార్ట్ ఫీచర్
Revolt RV400 ఎలక్ట్రిక్ బైక్ వినియోగదారులకు శుభవార్త. రివోల్ట్ మోటార్స్ సంస్థ కీలెస్ మోటార్ ఆన్/ఆఫ్ ఫీచర్‌ను అందిస్తోంది. రివాల్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ తన మొట్ట మొదటి రెండు మోటార్‌సైకిళ్లను 2019 లో విడుదల చేసింది. అచ్చం పెట్రోల్ స్పోర్ట్స్ బైక్‌ను తలపించేలా వచ్చిన ఈ బైక్‌కు వచ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ బైక్ పై వచ్చిన డిమాండ్‌తో సప్లయి చేయలేక రివోల్ట్.. బుకింగ్‌లను నిలిపివేయవలసి వచ్చింది.
అయితే తన వినియోగారుల కోసం ఇప్పుడు కంపెనీ తన రివోల్ట్ ఆర్వీ 400ను అప్‌డేట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో డెలివరీ చేయనున్న కొత్త Revolt RV400 బైక్‌లు స్మార్ట్‌ఫోన్ ఆధారిత కీలెస్ మోటార్ ఆన్/ఆఫ్ ఫీచర్‌తో వస్తాయి.
మోటార్‌సైకిల్‌ని సమీపించేటప్పుడే తమ స్మార్ట్‌ఫోన్‌లో రివాల్ట్ యాప్‌పై స్వైప్ చేస్తే చాలు బైక్ స్టార్ట్ అవుతుంది. మోటారును స్విచ్ ఆఫ్ చేస్తున్నప్పుడు కూడా ఇలాగే చేయాలి. వినియోగదారుడు ఈ ఫీచర్ ద్వారా రద్దీగా ఉండే పార్కింగ్ స్థలంలో తమ మోటార్‌సైకిల్‌ను సులభంగా గుర్తించవచ్చు. కాగా తాము Revolt RV400ను తనిఖీ చేశామని, ఈ ఫీచర్ కొత్త డెలివరీలలో మాత్రమే అందుబాటులో ఉందని కంపెనీ ధ్రువీకరించింది.
పాత కస్టమర్లకు కూడా..
అయితే, Revolt RV400 పాత వినియోగదారులు బాధపడాల్సిన అవసరం లేదు. కంపెనీ ఒక అప్‌డేట్‌ను రూపొందించింది. ఇప్పటికే ఉన్న కస్టమర్ మోటార్‌సైకిళ్లపై కూడా ఈ ఫీచర్లను అందించాలని దాని కస్టమర్ కేర్ సెంటర్లను ఆదేశించింది. ఈ అప్‌డేట్ Revolt RV400 బైక్ కోసం మాత్రమే.
కానీ RV300 వినియోగదారులకు ఈ ఫీచర్ను అందించడం లేదు. మరో మంచి విషయమేమిటంటే.. ఈ అదనపు ఫీచర్ కోసం కస్టమర్‌లు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈ విషయమై రివాల్ట్ మోటార్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ” వినియోగదారులకు స్వైప్ టు స్టార్ట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినందుకు మేము సంతోషిస్తున్నాము. మేము ప్రత్యేక ఆవిష్కరణను అందించడానికి, రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాము” అని పేర్కొన్నారు.
ఈ ఫీచర్‌తో వినియోగదారులకు ఇప్పుడు ప్రత్యేకంగా కీ అక్కర లేదు. వినియోగదారులు తమ మొబైల్ ఫోన్తో బైక్‌ని స్టార్ట్ చేయవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా తమ కస్టమర్‌ల నుండి మాకు అద్భుతమైన స్పందన లభించిందని, వారి కోస తాము క్లాస్ టెక్నాలజీలో ఉత్తమమైన ఆవిష్కరణలను అందిస్తూనే ఉంటామని తెలిపారు.
Awesome
Super
Super