Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Simple Dot One: సింపుల్ ఎనర్జీ నుంచి రూ. 1 లక్ష లోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌

Spread the love

డిసెంబర్ 15న లాంచ్..

Simple Dot One e-scooter : సింపుల్ ఎనర్జీ డిసెంబరు 15న తక్కువ ధరలోనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సింపుల్ డాట్ వన్ (Simple Dot One) అని పిలువబడే ఈ కొత్త సబ్ వేరియంట్ సింపుల్ వన్ కంటే తక్కువ స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఈ ఏడాది ఆగస్టులో బెంగళూరుకు చెందిన EV స్టార్టప్ భారతదేశంలో సింపుల్ డాట్ వన్, డాట్ వన్ పేర్లతో రెండు ట్రేడ్‌మార్క్‌లను దాఖలు చేసింది.

ఇది సింపుల్ వన్ మాదిరిగానే అదే ప్లాట్‌ఫారమ్‌ పై డాట్ వన్ నిర్మితమైంది. డాట్ వన్ లక్ష రూపాయల కంటే తక్కువ ధరతో రానున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం అంటే మధ్య తరగతి ప్రజలకు మరింత అందుబాటులో ఉంటుంది. అయితే, లాంచ్ సమయంలో ఖచ్చితమైన ధర ప్రకటించనున్నారు.

దీనిపై సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు & CEO సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, “మేము సింపుల్ డాట్ వన్‌ను సగర్వంగా పరిచయం చేస్తున్నందున సింపుల్ ఎనర్జీ ప్రయాణంలో ఇదొక కీలకమైన అధ్యాయంగా నిలుస్తుంది. ఇది మా సింపుల్ వన్ సిరీస్‌కి సరికొత్త సరసమైన అనుబంధం. అన్ని వర్గాల వారికి ఎలక్ట్రిక్ మొబిలిటీని అందించాలనే ఉద్దేశంతో సింపుల్ డాట్ వన్‌ను తీసుకొస్తున్నాం. అత్యాధునిక ఫీచర్‌లతో సొగసైన డిజైన్‌తో ఇది వస్తుంది.

Simple Dot One : ఫీచర్స్

ఎలక్ట్రిక్ మోటారుపై సింపుల్ ఇంకా ఖచ్చితమైన స్పెసిఫికేషన్‌ను వెల్లడించనప్పటికీ.. డాట్ వన్ ఫిక్స్డ్ డ్ 3.7 kWh బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది ఒక్కసారి చార్జిపై IDC పరిధి 160 కిలోమీటర్లు, 151 కిమీల సర్టిఫైడ్ పరిధిని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. డాట్ వన్‌లోని టైర్లు సాధారణ టైర్‌ల కంటే విభిన్నంగా ఉన్నాయని సింపుల్ వెల్లడించింది. స్కూటర్ ఆన్-రోడ్ రేంజ్ ను మెరుగుపరచడంలో టైర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అవి వాహనం మొత్తం పనితీరును పెంచడం కోసం ప్రత్యేకంగా రూపొందించారు.

 కొత్త ఇ-స్కూటర్ కోసం ప్రీ-బుకింగ్‌లు డిసెంబరు 15న ప్రారంభం కానున్నాయి. కంపెనీ ప్రస్తుత కస్టమర్‌లు ఇప్పుడు సింపుల్ డాట్ వన్ స్కూటర్‌తో మరిన్ని ఆప్షన్లను కలిగి ఉన్నారు. వారు వారి ప్రాధాన్యతల ప్రకారం ఏదైనా సాధారణ స్కూటర్‌ని ఎంచుకోవచ్చు.

డాట్ వన్ స్కూటర్ సీటు కింద 30 లీటర్ల కంటే స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. అదనంగా ఇది వివిధ స్మార్ట్ ఫంక్షన్‌లను నిర్వహించే టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ను కూడా కలిగి ఉంటుంది. అదనపు సౌలభ్యం కోసం మొబైల్ యాప్ కనెక్టివిటీని అందిస్తుంది.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు… కృతజ్ఞతలు..

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *