Simple Energy ప‌వ‌ర్‌ఫుల్ ఫాస్ట్ చార్జ‌ర్‌

Spread the love

simple enegry

బెంగుళూరుకు చెందిన ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ Simple Energy కొత్తగా సింపుల్ లూప్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ ఫాస్ట్ ఛార్జర్‌ను ఆవిష్క‌రించింది.  దీంతో పాటు ఈ సంస్థ త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్న సింపుల్ వన్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు సంబంధించిన కొంత స‌మ‌చారాన్ని పంచుకుంది.  దీని ప్రకారం సింపుల్ వ‌న్ ఎలక్ట్రిక్ స్కూట‌ర్లో 30 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇది ప్రీమియం సెగ్మెంట్‌లో అతి పెద్దదని కంపెనీ పేర్కొంది.

దేశవ్యాప్తంగా 300 ఛార్జింగ్ స్టేష‌న్లు

Simple Energy సింపుల్ లూప్ ఫాస్ట్ ఛార్జర్‌కు సంబంధించి దాని ప్రణాళికలను వెల్ల‌డించింది. ఇది దేశ‌వ్యాప్తంగా అన్ని న‌గ‌రాల్లో ఏర్పాటు చేయ‌నుంది. కొన్ని నెల‌ల్లో సింప‌ల్ ఎన‌ర్జీ కంపెనీ 300కు పైగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయ‌నుంది.  ఇందులో అన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఛార్జీలు ఉపయోగించడానికి సౌకర్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.  ఇక ఈ ఛార్జర్‌లను ఏర్పాటు చేయడానికి కంపెనీ షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెస్టారెంట్లు మొదలైన వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది.

సింపుల్ లూప్ 60 సెకన్ల వ్యవధిలో 2.5 కిమీ వరకు వెళ్ల‌గ‌లిగేలా ఛార్జ్ చేసే సామ‌ర్థ్యం ఉంటుంది.  ఈ అంశంమై సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, CEO సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ “సింపుల్ వన్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించడానికి తాము సంతోషిస్తున్న‌ట్లు తెలిపారు.  ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణను ప్రారంభించామ‌ని తెలిపారు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి దశలో భారతదేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాలలో లాంచ్ చేయబడుతుంది.  మొద‌టి ద‌శ‌లో నగరాలలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, గోవా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ మరియు పంజాబ్ వంటి రాష్ట్రాల్లో విక్ర‌యించ‌నున్నారు.  సింపుల్ ఎనర్జీ ఈ రాష్ట్రాల్లోని ప్ర‌ధాన నగరాల్లోని కంపెనీ త‌న ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను త్వరలో పూర్తిచేస్తుంది.  అక్క‌డి నుంచే డెలివరీలను ప్రారంభిస్తారు.  Simple Energy తన మొదటి ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వ‌న్ ను ఆగ‌స్టు 15, 2021 న సాయంత్రం 4 గంటలకు లాంచ్ చేయనుంది.  దీనికి సంబంధించిన అన్ని వివరాలను లాంచ్ ఈవెంట్‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు.

ధర సుమారు రూ.1,10,000 నుండి రూ.1,20,000

Simple One electric scooter మిడ్ డ్రైవ్ మోటార్‌తో పాటు డిటాచ‌బుల్( వేరుచేయ‌గ‌లిగిన) బ్యాటరీ ఇందులో ఉంటుంది. ఇది టచ్ స్క్రీన్, ఆన్‌బోర్డ్ నావిగేషన్, బ్లూటూత్ మొదలైన స్మార్ట్ ఫీచర్‌లతో వస్తుంది, సింపుల్ వ‌న్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ.1,10,000 నుండి రూ .1,20,000 వరకు ఉంటుంది.

Simple one Specification

  • Mileage-Range 260 km/charge
  • Charging Time 1 hour 5 minutes
  • Max Power 9.51 PS
  • Torque 72 Nm
  •  Drive Type Hub Motor
  • Starting Push Button Start
  • Transmission Automatic
  • Battery Type Lithium Ion
  • Battery Capacity 4.2kwh

3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..