Agri News
Oil Plam | రైతు ఇంటి వద్దే పామాయిల్ కొనుగోలు చేస్తాం..
Telangana | తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆయిల్ పామ్ (Oil Plam ) సాగుపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao ) సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేస్తామని, పామాయిల్ పంటను రైతు ఇంటి వద్దనే కొంటామని తెలిపారు. పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. వలస జిల్లాగా పేరు పొందిన […]
Agri News | తెలంగాణలో సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటు
హైదరాబాద్: భవిష్యత్ లో తెలంగాణలో సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) తెలిపారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి.. గురువారం రెండో రోజు పలు సంస్థలను సందర్శించారు. ప్రపంచంలోనూ అతి పెద్ద వ్యాపార ఆధారిత క్రూడ్ ఫామాయిల్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎఫ్‌జీవీ కంపెనీకి చెందిన సీడ్ గార్డెన్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్ధతులతో ఉన్న విత్తన కేంద్రాన్ని పరిశీలించిన […]
MSP Hike | రైతులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు
MSP Hike : దీపావళి పండుగ సందర్భంగా మోదీ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపునకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు. రబీ పంటలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని వివరించారు. ఆవాలు క్వింటాల్‌కు రూ.300, గోధుమలు రూ.150, […]
Agri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..
Agri News | తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల మంజూరు కోసం కోసం గైడ్ లైన్స్ రూపొందించేందుకు గాను మంత్రి […]
Kharif Season | దెబ్బతీసిన వర్షాలు.. తెలంగాణలో గత ఐదేళ్లలో ఈసారి అత్యల్ప సాగు
Kharif Season | హైదరాబాద్ : ఈ వనకాలం (ఖరీఫ్) సీజన్‌లో తెలంగాణలో పంటల సాగు తీవ్రంగా పడిపోయింది.మొత్తం పంట విస్తీర్ణం దాదాపు 1.23 కోట్ల ఎకరాలకే పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో 1.29 కోట్ల ఎకరాల సాధారణ విస్తీర్ణంలో 1.28 కోట్ల ఎకరాల్లో సాగు చేశారు. సీజన్ ముగియడానికి ఇంకా రెండు వారాల కంటే తక్కువ సమయం ఉంది. మొత్తం పంట విస్తీర్ణం ఇప్పటికిప్పుడు మెరుగుపడే అవకాశం లేదు. గతేడాది సమయానికి పంటలకు సరిపడా […]
Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!
Free Solar Power | సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి కూడా కీలక ప్రకటన చేశారు. 22 గ్రామాలకు ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా సోలార్ విద్యుత్ అందిస్తామని వెల్లడించారు. ఫైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే పేదలకు 200 యూనిట్ల వరకు […]
Palm Oil | పామాయిల్ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
Palm Oil | హైదరాబాద్ : పామాయిల్ రైతులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పామ్ ఆయిల్ రైతులకు ఊరటనిచ్చేలా ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచింది. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. దిగుమతి సుంకం పెంపుతో […]