Hero Lectro : రూ. 32,499లకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్..
ఎలక్ట్రిక్ -సైకిల్ బ్రాండ్ హీరో లెక్ట్రో (Hero Lectro) కొత్తగా రెండు మోడళ్లను ప్రారంభించింది. హీరో లెక్ట్రో H4 ఈ-సైకిల్ ఎక్స్ షోరూం ధర రూ. 32,499 కాగా, H7+ ఈ సైకిల్ ధర, రూ. 33,499 గా నిర్ణయించారు. ఈ మోడల్‌లు భారతీయ మార్కెట్ కోసమే రూపొందించారు.
H4 మిస్టిక్ పర్పుల్, వైబ్రెంట్ డిస్టెన్స్ రెడ్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది, హీరో లెక్ట్రో H7+ వినియోగదారులకు లావా రెడ్చ స్టార్మ్ ఎల్లో గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. స్వల్ప-దూర ప్రయాణాలలో విప్లవాత్మక మార్పులు చేయడానికి ఈ సైళ్లను తయారు చేసినట్లు కంపెనీ చెబుతోంది. H4, H7+ ఈ సైకిళ్లు 7.8 Ah బ్యాటరీతో వస్తాయి, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. దీని బ్యాటరీని 4.5 గంటల ఫుల్ రీఛార్జ్ అవుతాయి.కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్ పై ఫైర్‌ఫాక్స్ బైక్‌ల CEO శ్రీరామ్ సుంద్రేశన్ మాట్లాడుతూ.. “హీరో లెక్ట్రో హెచ్4, హె...