
TATA Curvv EV | టాటా మోటార్స్ Cruvv EV ని భారతదేశంలో ప్రారంభించింది. టాటా మోటార్స్ నుంచి ఇది ఐదో ఆల్-ఎలక్ట్రిక్ వాహనం. Cruvv SUV ఐసీఈ వెర్షన్‌తో పాటు కొత్త టాటా కర్వ్ EVని కూడా పరిచయం చేసింది. ICE వెర్షన్ వచ్చే నెలలో విక్రయాలు జరపనున్నారు. Cruvv EV ధర రూ.17.49 లక్షల నుంచి రూ.21.99 లక్షల మధ్య ఉంది. కొత్తగా విడుదల చేసిన ఎలక్ట్రిక్ SUV గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Tata Cruvv EV: డిజైన్
Curvv EV, కర్వ్ ICE మోడల్‌లు డిజైన్ పరంగా కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌లో క్లోజ్డ్-ఆఫ్ ‘గ్రిల్’, EV స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా క్లోజ్డ్ నోస్ మౌంటెడ్ ఛార్జర్, వర్టికల్ స్టైలింగ్ ఎలిమెంట్‌లతో తక్కువ బంపర్ ఏరియా ఉన్నాయి. 18-అంగుళాల ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్ (215/55 టైర్లతో అమర్చబడి ఉంటాయి) అయితే వెనుక భాగం బ్యాడ్జ్‌లు కాకుండా చాలా వరకు ఒకేలా ఉంటుంది. వాహనం ముందు, వెనుక రెండూ LED లైట్లతో అలంకరించారు. టాటా తన అధికారిక యాక్సెసరీస్‌ను Tata.ev ఒరిజినల్స్ అని కూడా లాంచ్ చేసింది,
Tata Cruvv EV: రేంజ్, బ్యాటరీ వివరాలు
Curvv EV రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను అందిస్తుంది: క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ వేరియంట్‌లలో 40.5kWh యూనిట్ ను వినియోగించగా అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ S, ఎంపవర్డ్+, ఎంపవర్డ్+ A వేరియంట్‌ల కోసం 55kWh ను చూడవచ్చు. కాగా 40.5kWh బ్యాటరీ ప్యాక్ 502km రేంజ్ ఇస్తుంది. 55kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 585km వరకు వెళ్లవచ్చు. అదనంగా, టాటా దాని స్వంత C75 ప్రమాణం టెస్టింగ్ ప్రకారం లాంగ్ రేంజ్ మోడల్ ఒకే ఛార్జ్‌పై 400-425కిమీ ప్రయాణించగలదు. 45kWh Curvv EV 330-350కిమీల C75 రేంజ్ కలిగి ఉంది.
అన్ని వేరియంట్‌లు ఫ్రంట్ యాక్సిల్‌పై 167hp ఎలక్ట్రిక్ మోటారుతో అమర్చబడి ఉంటాయి, Curvv EV 0-100kph నుంచి 8.6 సెకన్లలో 160kph గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. కేవలం 15 నిమిషాల్లో 150కిమీల పరిధిని అందించేందుకు ఛార్జ్ చేయవచ్చు.70kW ఛార్జర్‌ను ఉపయోగించి 40 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్‌ని చేరుకోవచ్చని టాటా మోటార్స్ పేర్కొంది. iRA యాప్ ఛార్జ్ పాయింట్‌ను అనుసంధానిస్తుంది మోడల్ వెహికల్-టు-లోడ్ (V2L), వెహికల్-టు-వెహికల్ (V2V) ఛార్జింగ్ సామర్థ్యాలతో వస్తుంది.
టాటా Curvv స్పెసిఫికేషన్స్
కర్వ్ ఈవీ లోపలి భాగం గ్రే కలర్ డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌ను కలిగి ఉంది. మధ్యలో 12.3-అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో డ్యాష్‌బోర్డ్ నెక్సాన్‌ను గుర్తుకు తెస్తుంది. ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ కింద, టచ్ ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, ట్రాపెజోయిడల్ AC వెంట్స్ ఉన్నాయి.
నాలుగు-స్పోక్ స్టీరింగ్ వీల్ హారియర్‌లో మాదిరిగా ఉంటుంది. రీజెన్ మోడ్‌లను సర్దుబాటు చేయడానికి ప్యాడిల్ షిఫ్టర్‌లతో వస్తుంది. టాప్-స్పెక్ మోడల్‌లలో నావిగేషన్‌తో కూడిన 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. సెంటర్ కన్సోల్‌లో రోటరీ డ్రైవ్ సెలెక్టర్, గేర్ లివర్ (నెక్సాన్ EVలో కనిపించే నాబ్ కాకుండా) వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఉన్నాయి. అదనంగా, Curvv EV ఒక ఫ్రంక్‌తో అమర్చబడి ఉంటుంది. బూట్ స్పేస్ 500 లీటర్లు ఉంటుంది.
వెంటిలేటెడ్ సిక్స్-వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, 2 స్టెప్ వెనుక సీటు రిక్లైన్ ఫంక్షన్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ముందు, వెనుక 45W టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌లు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, Arcade.ev యాప్ సూట్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్. టాప్-స్పెక్ మోడల్‌లు 320W 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్‌తో కూడా వస్తాయి.
సేఫ్టీ ఫీచర్లు..
భద్రతా లక్షణాలను పరిశీలిస్తే కర్వ్ ఈవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటో హోల్డ్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్-స్టార్ట్, డీసెంట్ అసిస్ట్, ESP, డ్రైవర్ డ్రస్‌నెస్ అలర్ట్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, లెవల్ 2 ADAS ఫీచర్లు ఉన్నాయి. Curvv EV 20kph వేగంతో పాదచారులను హెచ్చరించడానికి సౌండ్ అలర్ట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..