Sunday, November 24Lend a hand to save the Planet
Shadow

EV sector లో 2030 నాటికి కోటి ప్ర‌త్య‌క్ష ఉద్యోగాలు

Spread the love

సగటు ఉద్యోగుల వృద్ధిలో 108% ఉందని సర్వే

దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పరిశ్రమ (EV sector )దూసుకుపోతోంది. ఈ రంగంలో ఉపాధిలో గణనీయమైన వృద్ధి కనిపించింద‌ని ఒక స‌ర్వేలో గుర్తించారు. గత రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య సగటు వృద్ధి 108% వ‌ర‌కు చేరింద‌ని తేలింది.

స్టాఫింగ్, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ CIEL HR సర్వీసెస్ తన తాజా సర్వేలో ఒక సంవత్సరం, ఆరు నెలల కాలంలో, వరుసగా 35% , 13% వృద్ధిని న‌మోదు చేసిన‌ట్లు గుర్తించింది. నాయకత్వ స్థానాల్లోకి మహిళలు వేగంగా అభివృద్ధి చెందుతున్నారని కూడా పేర్కొంది.

అయితే 62% ఉద్యోగ నియామకాలతో బెంగళూరు ముందుంది, ఢిల్లీలో 12%, పూణేలో 9%, కోయంబత్తూరులో 6% , చెన్నైలో 3% ఉన్నాయి.
‘Latest employment trends in EV sector 2022’ పేరుతో 52 కంపెనీల్లో విస్తరించి ఉన్న 15,700 మంది ఉద్యోగులపై సర్వే నిర్వహించబడింది. EV సెక్టార్‌లో ఇంజినీరింగ్ విభాగం ముందుంద‌ని, ఆ తర్వాత ఆపరేషన్, సేల్స్, క్వాలిటీ అస్యూరెన్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, IT, HR , మార్కెటింగ్ విభాగాలు ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయని వెల్లడించింది.

2030 నాటికి EV పరిశ్రమ సుమారు కోటి ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని, దీనివల్ల దాదాపు ఐదు కోట్ల పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ (ministry of skill development and entrepreneurship ) అంచనా వేసింది.

ప్రముఖ EV సంస్థ‌లు గత ఆరు నెలల్లో 2,236 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి. ఈ విభాగంలో మహిళలు దూసుకుపోతున్నారు. Kinetic Green (కైనెటిక్ గ్రీన్), Mahindra Electric Mobility (మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ), Convergence Energy Services (కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్), OBEN Electric Vehicle and Ampere Vehicles (
ఆంపియర్ వెహికల్స్ ) వంటి కంపెనీలు టాప్ మేనేజ్‌మెంట్ స్థానాల్లో మహిళలను కలిగి ఉన్నాయి. తమిళనాడులోని ఓలా కొత్త ఇ-స్కూటర్ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారని, వారిలో 10,000 మందికి పైగా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని తెలిపింది.

CIEL HR CEO ఆదిత్య నారాయణ్ మిశ్రా మాట్లాడుతూ.. “భారతదేశం ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో అధిక పెట్టుబడి పెడుతోంది. ఇది రంగం ఊపందుకుంటున్నట్లయితే భారతీయ EV విభాగం 2030 నాటికి $206 బిలియన్ల వృద్ధిని చేరుతుంది. ఈ వేగవంతమైన వృద్ధితో, పరిశ్రమలో ఇంజనీరింగ్ డొమైన్‌లకు అధిక అవకాశం ఉంద‌ని తెలిపారు.

EV తయారీదారులు వ్యూహాత్మక మధ్య స్థాయి నియామకాలు చేప‌డుతున్నారు. దాదాపు 41% ఉద్యోగ పోస్టింగ్‌లు అసోసియేట్ స్థాయికి, మిడ్-సీనియర్ స్థాయికి 34%, అయితే 21% మాత్రమే ఎంట్రీ లెవల్‌లో ఉన్నాయి. ఈ రంగంలో కేవలం 12% ఉద్యోగాలు రిమోట్‌గా , 8% హైబ్రిడ్ మోడ్‌లో కొనసాగుతాయని అంచనా వేసింది.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *