TVS iQube S vs Ola S1X+ | భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌లు అనేక వేరియంట్లు మార్కెట్ లోకి విడుదల చేశాయి. బజాజ్, హీరో మోటోకార్ప్, TVS వంటి ప్రధాన కంపెనీలు కేవలం సింగిల్ వేరియంట్ ను మాత్రమే తీసుకువచ్చాయి. అయితే ఈవీ మార్కెట్ లో వారు వెనుకబడి ఉన్నట్లు అనిపించినప్పటికీ, ప్రసిద్ధ OEMలు మెరుగైన డిజైన్, క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్ కారణంగా అమ్మకాల్లో ముందుకు దూసుకువెళ్తున్నాయి.
Ola S1X+ భారతీయ మార్కెట్లో ఒక ప్రసిద్ధ మోడల్, TVS iQube S కూడా అదేస్థాయిలో ప్రజాదరణ పొందింది. అయితే ఈ రెండు స్కూటర్ల మధ్య ఏది బెస్ట్ అని నిర్ణయించుకోవాల్సి వస్తే ముందుగా వీటిలో ఉన్న ఫీచర్లను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ స్టోరీలో TVS iQube S మరియు Ola S1X+ మధ్య పోలిక లు తేడాలను మీరు తెలుసుకోవచ్చు.
TVS iQube S vs Ola S1X+ ఫీచర్లు
స్కూటర్లు ఏమి ఆఫర్ చేస్తున్నాయో తెలుసుకుందాం.. TVS iQube S ఎలక్ట్రిక్ స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ట్విన్ రియర్ షాక్‌లు, ముందు డిస్క్ బ్రేక్ , వెనుకవైపు డ్రమ్ బ్రేక్, 12-అంగుళాల టైర్లు, 7-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. ఫీచర్ల పరంగా, iQube S పార్క్ అసిస్ట్, జియో-ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ అలర్ట్, USB ఛార్జర్, మ్యూజిక్ కంట్రోల్‌తో ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఇప్పుడు, ఓలా S1X+ పరిశీలిస్తే.. ఈ స్కూటర్ కూడా ఇదే విధమైన సస్పెన్షన్ సెటప్‌ను పొందుతుంది, అయితే బ్రేకింగ్ ఫ్రంట్‌లో, ఇది రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. Ola S1X+ చిన్న 5-అంగుళాల LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది. ఫీచర్లలో సైడ్ స్టాండ్ వార్నింగ్, ఫోన్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్, GPS కనెక్టివిటీ, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ఉన్నాయి.
బ్యాటరీ, రేంజ్, పనితీరు
tvs iqube vs ola s1x+ : ఎలక్ట్రిక్ స్కూటర్లలోని అత్యంత కీలకమైన బ్యాటరీ, రేంజ్, పనితీరు విషయానికి వస్తే, రెండు స్కూటర్ల బ్యాటరీ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. iQube S స్కూటర్ లో 3.4kWh బ్యాటరీ ప్యాక్‌తో శక్తిని పొందుతుంది. ఇది పూర్తి ఛార్జింగ్‌పై 100 కిమీల వరకు ప్రయాణిస్తుంది. 78kmph గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది. అయితే iQube 4.2 సెకన్లలో 0 నుండి 40kmph వరకు వేగాన్ని అందుకుంటుంది.
pm kusum yojana 2024 | కుసుమ్ యోజన అంటే ఏమిటి? రైతులకు ఈ పథకం ద్వారా ఎలా లబ్ధి పొందవచ్చు..
Ola S1X+ స్కూటర్ 3kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఫుల్ ఛార్జ్‌పై 125km రియల్ టైం రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. స్కూటర్ మూడు రైడ్ మోడ్‌లను కలిగి ఉంది. 3.3 సెకన్లలో 0 నుండి 40kmph వరకు వేగాన్ని అందుకుంటుంది.గరిష్టంగా 90kmph స్పీడ్ తో వెళ్తుంది. స్పెక్ షీట్ ప్రకారం, Ola ఒక చిన్న బ్యాటరీని కలిగి ఉంది. అయితే iQube కంటే ఎక్కువ రేంజ్, టాప్ స్పీడ్‌ను అందిస్తుంది అలాగే స్పీడ్ కూడా ఎక్కువే.. అయితే, iQube S కంటే Ola S1X+ కలిగి ఉన్న అతి పెద్ద ప్రయోజనమేంటంటే.. ధర, ఇది రూ.లక్ష కంటే తక్కువగా ఉంటుంది.
TVS iQube S vs Ola S1X+: ఏది బెస్ట్?
రెండింటినీ పోల్చి చూసేటప్పుడు, Ola ఎక్కువ ఫీచర్లు, ఎక్కువ రేంజ్, మెరుగైన పనితీరు అలాగే iQube కంటే తక్కువ ధరలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది మంచి ఎంపిక. అయినప్పటికీ, టీవీఎస్ ఓలా కంటే నమ్మకమైన బ్రాండ్, బిల్ట్ క్వాలిటీ బాగుంటుంది.. కానీ ప్రస్తుతం మార్కెట్ లో ఓలా S1X+ యువ తరాన్ని ఆకర్షిస్తోంది.