ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ఇటీవలే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అత్యంత తక్కువ ధరలో కొత్త వేరియంట్ చేతక్ 2901 ఎడిషన్‌ను విడుదల చేసింది. భారతదేశంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర (Bajaj Chetak 2901 price ) రూ. 1 లక్షలోపే ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ ఉన్న Ola S1 Air, Ather 450S వంటి ఈవీ స్కూటర్లతో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. బజాజ్ చేతక్ 2901 ఎడిషన్ టాప్ హైలైట్‌లను ఇప్పుడు చూద్దాం .
రిట్రో స్టైలింగ్
బజాజ్ చేతక్ 2901 ఇతర చేతక్ స్కూటర్ల మాదిరిగానే సంప్రదాయ డిజైన్ ను కలిగి ఉంది. చేతక్ డిజైన్ రెట్రో స్టైలింగ్, మోడ్రన్ అప్పీల్ ఇస్తుంది. యూత్ ను ఆకర్శించేందుకు బజాజ్ చేతక్ 2901 కోసం పలు విభిన్నమైన బోల్డర్ కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చింది. కలర్ ఆప్షన్లు ఇవే..
- రేసింగ్ రెడ్
- సైబర్ వైట్
- ఎబోనీ బ్లాక్ మెట్
- లెమన్ ఎల్లో..
- అజూర్ బ్లూ
స్పెసిఫికేషన్లు
Chetak 2901Specifications : స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, బజాజ్ చేతక్ 2901 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది, ఇది ARAI- ధృవీకరించబడిన రేంజ్..సింగిల్ చార్జిపై 123km మైలేజీ అందిస్తుంది. రియల్ రేంజ్ 90-100 కి.మీ.గా ఉంటుందని అంచనా. స్కూటర్ లో 4kw ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. ఇది గంటకు 63kmph వేగంతో ప్రయాణిస్తుంది. చేతక్ 2901 ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందించదు. బ్యాటరీని ఆరు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
కొత్త బజాజ్ చేతక్ ధరను రూ.లక్ష లోపు అందించడానికి బజాజ్ కొన్ని స్మార్ట్ కాస్ట్ కటింగ్ చేసింది. కానీ కంపెనీ స్కూటర్‌పై కొన్ని కీలకమైన ఫీచర్ల సెట్‌ను అందించడం మానుకోలేదు. చేతక్ 2901 బ్లూటూత్ కనెక్టివిటీ, LED లైటింగ్, కలర్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు అల్లాయ్ వీల్స్ ను అందిస్తోంది.
ఆప్షనల్ TecPac తీసుకుంటే..
ఆప్షనల్ TecPacని కొనుగోలు చేయడం ద్వారా కస్టమర్‌లు అదనంగా కొన్ని అత్యాధునిక ఫీచర్‌లను పొందుతారు. TecPac లో హిల్ హోల్డ్, కాల్, మ్యూజిక్ కంట్రోల్, రివర్స్, స్పోర్ట్, ఎకానమీ మోడ్‌లు, ఫాలో-మీ-హోమ్ లైట్లు, బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను పొందవచ్చు.
బజాజ్ చేతక్ 2901 ధర
Bajaj Chetak 2901 price : బజాజ్ చేతక్ 2901 స్కూటర్ భారతదేశంలోని 500 షోరూమ్‌లలో బుకింగ్‌లను ప్రారంభించింది. స్కూటర్ ధర రూ. 95,998 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). పోటీ పరంగా బజాజ్ చేతక్ 2901 మార్కెట్‌లో ప్రస్తుతం Ola S1X, Ather Rizta S, Ola S1X లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..