Monday, January 20Lend a hand to save the Planet
Shadow

VinFast Klara S | 190కి.మీ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో ఇండియాలో విడుదల..

Spread the love

VinFast Klara S | వియత్నాం దేశానికి చెందిన ఈవీ తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఆటో (VinFast Auto) ..  ఫిబ్రవరి 25, 2024న తమిళనాడులోని తూత్తుకుడిలో తన ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే కొద్ది రోజుల్లోనే భారతదేశంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకదానికి డిజైన్ పేటెంట్‌ను నమోదు చేసింది.

2017లో ప్రారంభ‌మైన విన్‌ఫాస్ట్ కంపెనీ.. అన‌తికాలంలోనే అత్యాధుని ఫీచ‌ర్లు క‌లిగిన‌ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విడుద‌ల చేసి ప్రసిద్ది చెందింది. అయితే కంపెనీ తన హోమ్ మార్కెట్‌లో అనేక రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయిస్తోంది. CY2023లో, VinFast దాని మొత్తం 72,468 ఇ-స్కూటర్‌లను విక్రయించింది. వాటిలో ఒకటి క్లారా S (VinFast Klara S), దీని కోసమే ఇప్పుడు భారతదేశంలో డిజైన్ ట్రేడ్‌మార్క్‌ను నమోదు చేసింది.

రంగులు

విన్ ఫాస్ట్ Klara S ఎలక్ట్రిక్ స్కూటర్ వివిధ రకాలైన హై-ఎండ్ రంగులలో వస్తుంది. ఇది అత్యంత సొగసైన అత్యాధునిక రూపాన్ని ఇస్తుంది. అదనంగా, ఇది కస్టమర్‌లు వారి అభిరుచులకు అనుగుణంగా వారి ఎలక్ట్రిక్ స్కూటర్‌లను సవరించడానికి వీలు కల్పిస్తుంది. Vinfast Klara S ఎలక్ట్రిక్ స్కూటర్ 6 విభిన్న రంగు ఎంపికలలో వస్తుంది. అవి.. పెర్ల్ వైట్, గ్రీన్, బ్లూ వైలెట్, బ్రైట్ రెడ్, డార్క్ బ్లాక్..

READ MORE  Ola Electric : త్వరలో దేశవ్యాప్తంగా ఓలా ఎల‌క్ట్రిక్‌ 4,000 స్టోర్లు

స్పెసిఫికేషన్స్..

VinFast Klara S Specifications : కార్లా  ఎస్..  ఒక హబ్ మోటార్ (1.8kW నామినల్ పవర్, 3kW పీక్ పవర్) తో వ‌స్తుంది. గంట‌కు 78kph వేగంతో దూసుకెళ్తుంద‌ని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఇది చూడ‌డానికి ప్రముఖ ఇండియ‌న్ బ్రాండ్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ TVS iQube మాదిరిగా క‌నిపిస్తుంది. ఇక్క‌డ‌ తేడా ఏమిటంటే, Klara స్కూట‌ర్ లో Li-Ion కి బదులుగా LFP 3.5kWh సామర్థ్యం క‌లిగిన బ్యాటరీని ఉపయోగించింది.

READ MORE  Ola Electric : త్వరలో దేశవ్యాప్తంగా ఓలా ఎల‌క్ట్రిక్‌ 4,000 స్టోర్లు

కంపెనీ క్లారా S ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఎకో మోడ్ లో స్థిరమైన 30kph వేగంతో 65kg రైడర్‌తో 194km రేంజ్ ని క్లెయిమ్ చేస్తుంది. LFP బ్యాటరీలు Li-Ion కంటే బరువైనవి. అయితే VinFast బరువును 122kgలకు తగ్గించగలిగింది. Klara S 14-అంగుళాల ఫ్రంట్ వీల్‌తో పాటు ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లను క‌లిగి ఉంటుంది. బూట్ స్పేస్ 23-లీటర్లు ఉంది.

విన్ ఫాస్ట్ Klara S ఎలక్ట్రిక్ స్కూటర్ ను వియత్నాంలో ఇండియ‌న్ క‌రెన్సీలో రూ. 118,000 ధ‌ర‌కు విక్ర‌యిస్తోంది. భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లోకి ప్రవేశిస్తే, భారతదేశంలో కంపెనీ ఏయే ధరల్లో అందుబాటులోకి తెస్తుందో చూడాలి.

READ MORE  Ola Electric : త్వరలో దేశవ్యాప్తంగా ఓలా ఎల‌క్ట్రిక్‌ 4,000 స్టోర్లు

Specifications

Range194 km
Top speed78 km/h
Battery typeLFP
Battery3.5 kWh
MotorInhub
Max power3000 W
Front shock absorbersTelescopic, hydraulic shock absorbers
Rear shock absorbersCoil Spring, hydraulic shock absorbers
BrakesDiscs

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..