భారతదేశం పర్యావరణ అనుకూలమైన గ్రీన్ ఎనర్జీ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. పునరుత్పాదక శక్తులైన పవన విద్యుత్, సోలార్ విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వినియోగాన్ని పెంచుకుంటూ పోతోంది. 2000 నుండి 2022 వరకు ప్రతీ సంవత్సరం, భారతదేశం తన పవన శక్తి సామర్థ్యాన్ని 22 శాతం, సౌర సామర్థ్యాన్ని 18 శాతం పెంచుకుంది.
భారతదేశం తన పవన శక్తి (Wind Energy) సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచుకుంది. 2016 నుంచి 2022 మధ్య దాని సౌర సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసింది. పునరుత్పాదక సామర్థ్యం (India Renewable Energy) లో దేశం వృద్ధి.. బొగ్గు శక్తి వృద్ధిని మించిపోయిందనడానికి నిదర్శనం. కాలుష్యకారకమైన పెట్రోల్, డీజిల్ ఇందనాలకు ప్రత్నాయ్నాయంగా కేంద్రం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వైపు మారేందుకు భారతదేశం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఈ ప్రయాణంలో ఆటోమోటివ్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోంది.
అంతర్జాతీయ పరిశోధనా బృందం జీరో కార్బన్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. 2015 నుంచి 2022 వరకు ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌లు, స్కూటర్ల అమ్మకాలు 3,000 శాతానికి పైగా పెరిగాయి.
Renewable Energy లక్ష్యాలు
కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం కోసం గ్రీన్ ఎనర్జీ మొబిలిటీ వైపు మారేందుకు భారతదేశం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. 2030 నాటికి సంచిత ఉద్గారాలను ఒక బిలియన్ టన్నుల మేర తగ్గించాలని నిర్ణయించుకుంది. అలాగే 2030 నాటికి పునరుత్పాదక సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచుతామని, 2030 నాటికి స్థూల దేశీయోత్పత్తి ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించాలని, పునరుత్పాదక ఇంధన అవసరాల్లో 50 శాతం తీర్చాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్దం చేసుకొని ముందుకు సాగుతోంది. భారతదేశం తన శక్తి అవసరాలలో 50 శాతం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రీన్ ఎనర్జీ కోసం భారీగా పెట్టుబడులు
భారతదేశం తన హరిత లక్ష్యాలను సాధించడానికి గ్రీన్ ఎనర్జీ ట్రాక్షన్ కోసం గణనీయంగా పెట్టుబడి పెట్టింది. 2021లో ఇంధన పరివర్తనలో అత్యధిక పెట్టుబడులు పెట్టిన దేశాలలో భారతదేశం ఏడవ స్థానంలో నిలిచింది. ఆ సంవత్సరం, భారతదేశం పునరుత్పాదక శక్తిలో USD 11 బిలియన్లు, ఎలక్ట్రిక్ వాహన రంగంలో USD 1.6 బిలియన్లు పెట్టుబడి పెట్టింది. 2022లో, భారతదేశం విద్యుదీకరణ రవాణాలో పెట్టుబడులను రెండు రెట్లు పెంచి సుమారు USD 3.5 బిలియన్లకు చేరుకుంది.
ఇటువంటి పెట్టుబడులు ఎంతో ముఖ్యమైనవి ఎందుకంటే అవి ఆర్థిక వృద్ధికి దోహదపడుతాయి. విద్యుత్, రవాణా రంగాలలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి. ఇక పునరుత్పాదక, ఎలక్ట్రిక్ మొబిలిటీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారతదేశం కర్బన ఉద్గారాలను అరికట్టవచ్చు. దేశంలోని జనసాంద్రత కలిగిన నగరాల్లో గాలి నాణ్యతను పెంచవచ్చు.
2000 నుండి 2022 వరకు ప్రతి సంవత్సరం, భారతదేశం తన పవన సామర్థ్యాన్ని 22 శాతం, సౌర సామర్థ్యాన్ని 18 శాతం పెంచుకుంది. పారిస్ ఒప్పందం తర్వాత, భారతదేశం, 2016 నుండి 2022 వరకు, తన పవన సామర్థ్యాన్ని 533.7 శాతం, సౌర సామర్థ్యాన్ని 46.2 శాతానికి పెంచుకున్నట్లు నివేదిక పేర్కొంది.
2022లో విద్యుత్‌కు పవన, సౌర శక్తుల భారతదేశ సహకారం తొమ్మిది శాతం. మొత్తంమీద, పునరుత్పాదక ఇంధన వనరులు 20.5 శాతం విద్యుత్ ఉత్పత్తికి కారణమయ్యాయి. భారతదేశపు బొగ్గు సామర్థ్యం 2015లో 19 గిగావాట్ల నుంచి 2021లో నాలుగు గిగావాట్లకు తగ్గింది.
అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, సాంకేతిక పురోగతులు పునరుత్పాదక శక్తిలో విపరీతమైన వృద్ధికి కారణమయ్యాయి.
క్లీన్ ఎనర్జీ (Clean Energy Transition) అనేది ఆటోమోటివ్ పరిశ్రమకు మాత్రమే కాకుండా ఆర్థిక వృద్ధికి కూడా దోహదపడుతుందని భారత ప్రభుత్వం పేర్కొంది. 2022 నుండి 2030 వరకు భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ 49 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.
ఏటా దాదాపు 10 మిలియన్ యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న EV మార్కెట్‌లలో భారతదేశాన్ని ఒకటిగా మార్చింది. 2030 నాటికి, ఈ పరిశ్రమ దేశంలో 50 మిలియన్ల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా.
పునరుత్పాదక శక్తిలో ఆసియా పెట్టుబడి
ఇంధన పరివర్తనలో 2004 నుండి గణనీయమైన పురోగతిని సాధించిన ఇతర ఆసియా దేశాలు చైనా, వియత్నాం. పునరుత్పాదక శక్తిలో ఆసియా పెట్టుబడి విపరీతంగా పెరిగింది. సగటు వార్షిక వృద్ధి రేటు 23 శాతంగా ఉంది. 2022లో పునరుత్పాదక శక్తిలో ఆసియా పెట్టుబడి 345 బిలియన్ డాలర్లు. 2022లో ప్రపంచ పవన, సౌర శక్తి సామర్థ్యంలో ఆసియా 52.5 శాతం వాటాను కలిగి ఉంది.
2000 నుంచి 2022 మధ్య చైనాలో గాలి, సౌర శక్తులను అత్యంత వేగంగా విస్తరించింది. సోలార్, విండ్ టెక్నాలజీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చైనా ప్రముఖ కొనుగోలుదారుగా తయారీదారుగా నిలిచింది. 2018 నుంచి 2022 మధ్య, వియత్నాం తన సౌర సామర్థ్యాన్ని 18,380 శాతం పెంచుకుంది. వియత్నాం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌లు స్కూటర్ల విక్రయాలు కలిగిన దేశంగా నిలిచింది.
Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..