Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Ather electric scooter బిగ్ అప్‌డేట్‌..

Spread the love

Ather electric scooter భాగాలను త‌యారీకోసం Foxconn తో ఒప్పందం

Ather electric scooter : దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ త‌యారీ సంస్థ Ather Energy (ఏథర్ ఎనర్జీ..) త‌న ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కీలకమైన భాగాలను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి Foxconn (ఫాక్స్‌కాన్) టెక్నాలజీ గ్రూప్ కంపెనీ అయిన భారత్ ఎఫ్‌ఐహెచ్‌తో ఒప్పందాన్ని కుదుర్చ‌కుంది. ఇందులో భాగంగా, భారత్ ఎఫ్‌ఐహెచ్ ప్రత్యేకంగా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, డ్యాష్‌బోర్డ్, పెరిఫెరల్ కంట్రోలింగ్ యూనిట్లు, ఏథర్ 450X అలాగే 450 ప్లస్ Electric Scooters (ఎలక్ట్రిక్ స్కూటర్‌) కోసం ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) అసెంబ్లీలను తయారు చేయ‌నుంది.

మార్కెట్‌లో తమ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులైన Ather 450X, Ather 450 Plus డిమాండ్‌ను తీర్చేందుకు, తయారీ వ్యవస్థను మెరుగుపరచడమే ఈ ఒప్పందం లక్ష్యమ‌ని అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఉత్పత్తులు ‘టర్న్-కీ’ మోడల్‌లో తయారు చేయబడతాయి. భారత్ ఎఫ్ఐహెచ్ ఇప్పటికే తమ ప‌రిశ్ర‌మ‌లో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించింద‌ని పేర్కొంది.

ఈ అంశంపై Ather Energy సహ వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తరుణ్ మెహతా మాట్లాడుతూ.. “EV పరిశ్రమ బలమైన డిమాండ్‌తో అపూర్వమైన రేటుతో వృద్ధిని సాధిస్తోంద‌ని పేర్కొన్నారు. తాము దేశవ్యాప్తంగా మా రిటైల్ ఫుట్‌ప్రింట్‌ను విస్తరింపజేస్తూనే ఉన్నందున ఏథర్ ఎనర్జీ కూడా అసాధారణ వృద్ధి ద‌శ‌లో ఉంద‌ని తెలిపారు. త‌మ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మా స‌ప్లై చైన్‌ను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామ‌ని తెలిపారు.

మార్కెట్‌లో అంచనాలను సాధించడానికి భారత్ ఎఫ్‌ఐహెచ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని, భారత్ ఈ భాగస్వామ్యం నేడు EV పరిశ్రమలో పెద్ద ఆటో కాంపోనెంట్ తయారీదారులు గుర్తించే అవకాశాలు ఉన్నాయి.

భారత్ ఎఫ్‌ఐహెచ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జోష్ ఫౌల్గర్ మాట్లాడుతూ.. “భారత్‌లో తమ ఎలక్ట్రిక్ వెహికల్ జర్నీకి మద్దతివ్వడంలో ఏథర్ ఎనర్జీతో మా భాగస్వామ్యానికి సంతోషిస్తున్నామని తెలిపారు. ఇంటెలిజెంట్ మేము మా ఎలక్ట్రానిక్స్ తయారీ సేవలు, సాంకేతిక నైపుణ్యాన్ని ఏథర్ యొక్క మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణి కోసం విస్తరించాలని ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఏథర్ ఎనర్జీ వంటి EV టెక్నాలజీ సంస్థ యొక్క అన్ని ప్రయత్నాలకు మద్దతునిస్తామన్న నమ్మకం మాకు ఉందని చెప్పారు.

హోసురు ఫెసిలిటీలో

ఏథర్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లకు దేశ‌వ్యాప్తంగా భారీగా రెస్పాన్స్ వ‌స్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఏథర్ ఎనర్జీ తన హోసూర్ ప‌రిశ్ర‌మ‌లో సంవత్సరానికి 1,20,000 నుంచి 4,00,000 యూనిట్ల వరకు దాని ఉత్ప‌త్తుల‌ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీ ఇటీవల మరింత ఎక్కువ భూమిని సేకరించింది. రాబోయే మూడు సంవత్సరాల్లో, Ather తన వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ఒక మిలియన్ Ather electric scooter పెంచాలని భావిస్తోంది. భారతదేశం అంతటా 5,000 ఫాస్ట్ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేయాలని దాని నెట్‌వర్క్‌ను 600 స్టోర్‌లకు పెంచాలని ప్లాన్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *