Ather Rizta Best Deal

Ather Energy | ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. బ్యాటరీపై ఏకంగా 8 ఏళ్ల గ్యారంటీ..

Spread the love

Ather Ritza | ఎలక్ట్రిక్ వాహనదారులకు ఏథర్ ఎనర్జీ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఏథర్ తన ఏథర్ 450 సిరీస్, రిజ్టా స్కూటర్ల కోసం ‘ఎయిట్70 వారంటీ’ని ప్రవేశపెట్టింది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో తీసుకొస్తున్న ఈ వారంటీ స్కీమ్ తో EV కొనుగోలుదారులకు ఉన్న అతిముఖ్యమైన సమస్య అయిన బ్యాటరీ హెల్త్ పై ఆందోళనలను దూరం చేస్తుంది.

Eight70 వారంటీ గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు కవరేజీని అందిస్తుంది. ఏది మొదట వస్తే అది వర్తిస్తుంది. ఇది వారంటీ కాలంలో కనీసం 70% బ్యాటరీ హెల్త్ కు హామీ ఇస్తుంది. బ్యాటరీ తయారీ లోపాలుగానీ వైఫల్యాలకు గానీ పూర్తి కవరేజీని అందిస్తుంది. ముఖ్యంగా.. వారంటీలో క్లెయిమ్ మొత్తాలపై గరిష్ట పరిమితి లేదు. స్కూటర్‌ను ఛార్జ్ చేయకుండా లేదా ఎక్కువ కాలం పనిలేకుండా ఉంచడం వల్ల డీప్ బ్యాటరీ డిశ్చార్జ్ కారణంగా వచ్చే క్లెయిమ్‌లు తిరస్కరించబడవు.

ఎథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ EV కొనుగోలుదారులకు బ్యాటరీ మన్నిక అనేది కీలకమైన అంశం. వారి ఎలక్ట్రిక్ స్కూటర్‌ల బ్యాటరీలపై భరోసా కల్పించడానికి, రీప్లేస్‌మెంట్ ఖర్చులకు సంబంధించి కస్టమర్ల భయాందోళనలను పరిష్కరించడానికి కొత్త Eight70 వారంటీ ప్రవేశపెట్టింది.ఇది 8 సంవత్సరాల వరకు 70% బ్యాటరీ హెల్త్ పై హామీని అందిస్తుంది. “ఈ వారంటీ EV కొనుగోలుదారులు తమ స్కూటర్ బ్యాటరీల దీర్ఘకాలిక ఆరోగ్యానికి సంబంధించి ఏవైనా ఆందోళనలు తొలగిస్తుంది” అని ఆయన చెప్పారు.

రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ రాకేష్ జైన్ మాట్లాడుతూ, EV యజమానులకు దీర్ఘకాలిక రక్షణను అందించాలనే లక్ష్యంతో “ఏథర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపారు. EV పర్యావరణ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించడంలో పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి మా చొరవ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

Eight70 వారంటీ, ప్రో-ప్యాక్ కింద ఇప్పటికే ఉన్న 5-సంవత్సరాల వారంటీకి ఆప్షనల్ గా 3-సంవత్సరాల యాడ్-ఆన్ రెండు లైన్లకు అందుబాటులో ఉంది. ధర రూ. 4,999 (GSTతో కలిపి), ప్రో-ప్యాక్‌ని ఎంచుకునే కస్టమర్‌లు దీనిని పొందవచ్చు. ఇది Ather యొక్క EV యజమానులకు మనశ్శాంతిని కలిగిస్తుంది. ఏథర్ ఉత్పత్తి శ్రేణిలో 450 సిరీస్, రిజ్టా ఉన్నాయి. ఇది విభిన్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా విభిన్నమైన మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 450X, 450S మరియు 450 అపెక్స్ వంటి మోడల్‌లను కలిగి ఉన్న 450 సిరీస్, పనితీరును ఇష్టపడేవారిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఫ్యామిలీ మొత్తానికి అనువుగా ఉండేలా ఈ సంవత్సరం ప్రారంభంలో రిజ్టా (Ather Rizta ) అనే మోడల్ ను తీసుకొచ్చింది.

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

More From Author

How To Clean Cauliflower And Cabbage ?

కాలీఫ్లవర్, క్యాబేజీ పురుగులు ఆరోగ్యానికి ప్రమాదకరం.. వీటిని ఇలా శుభ్రం చేయండి..

New Electric Scooters Under 40k

ఈవీ కొనుగోలుదారుల‌కు పండుగే.. రూ.40 వేల‌కే ఓలా స‌రికొత్త ఈవీ స్కూట‌ర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

Indie Electric Scooter : భార‌తీయ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌కు అంతర్జాతీయ గౌరవం

రివర్ మొబిలిటీ ‘ఇండీ’ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు రెడ్ డాట్ డిజైన్ అవార్డు 2025 Indie Electric Scooter : రివర్ మొబిలిటీ తన ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం రెడ్ డాట్ ప్రొడక్ట్ డిజైన్ అవార్డు 2025ను అందుకుంది, 2024లో రెడ్ డాట్ డిజైన్ కాన్సెప్ట్ అవార్డుకు సైతం రివర్​ మొబిలిటీ కైవసం చేసుకుంది. ఈ...