National Hydrogen Mission.. హైడ్రోజన్ ఇంధన వాహనాల వైపు అడుగులు
National Hydrogen Mission : రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతండడంతో భారత ఆటోమొబైల్ రంగం విద్యుదీకరణ దిశగా సాగనుంది. ఈమేరకు 2030 నాటికి, ఎలక్ట్రిక్ వాహనాలు (EV లు) భారతదేశంలో మొత్తం కొత్త వాహన విక్రయాల్లో సుమారు 30% ఉంటాయని అంచనా. ఇందులో సింహభాగం.. ద్విచక్ర వాహనాలే దేశాన్ని విద్యుదీకరణ వైపు నడిపించనున్నాయి. ఈ విభాగంలో EV లు దశాబ్దం చివరి నాటికి మొత్తం అమ్మకాల్లో సుమారు దాదాపు 50% ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. కమర్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్, అంటే లైట్, హెవీ డ్యూటీ ట్రక్కులు అలాగే బస్సులు కూడా విద్యుదీకరణ వైపు అడుగులు వేయనున్నాయి.National Hydrogen Missionహైడ్రోజన్-ఆధారిత ఫ్యూయల్ సెల్ కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలు కర్బన ఉద్గారాలు వెలువరించవు. ఇవి జీరో ఎమిషన్ వాహనాలు లిథియం-అయాన్ లేదా ఇతర రకాల బ్యాటరీ-ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల కంటే హైడ్రోజన్ ఇంధనం కలిగ...