
Long-range Tata Nexon EV ఒక్క చార్జితో 400కి.మి
ఇండియాలో మే 11న లాంచ్
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో Tata Nexon EV ప్రథమ స్థానంలో ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారును మొదట జనవరి 2020లో ప్రారంభించారు. అయితే ఇప్పుడు త్వరలో అప్‌డేట్ వర్షన్ వస్తోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Long range Tata Nexon EV లాంచ్ తేదీని కంపెనీ ఎట్టకేలకు ప్రకటించింది. ఇది భారతదేశంలో మే 11, 2022న ప్రారంభించడుతుంది.కొత్త Long-range Tata NexonNexon EV లో మార్పుల విషయానికొస్తే.. పేరుకు తగినట్లుగా కొత్త Nexon EVలో అతిపెద్ద హైలైట్ దాని పెద్ద బ్యాటరీ ప్యాక్.. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఈ టాటా ఎలక్ట్రిక్ SUV లో 30.2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. అయితే రాబోయే మోడల్‌లో పెద్ద 40 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఫాస్టెస్ట్ AC ఛార్జింగ్ ఆప్షన్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడున్న Nexon EV ఒ...