Harithamithra Telugu News

Saturday, February 21Lend a hand to save the Planet
Shadow

EV Updates

జూన్ లో 6,479 ఇ-స్కూటర్‌లను విక్రయించిన ఏథర్ ఎనర్జీ

జూన్ లో 6,479 ఇ-స్కూటర్‌లను విక్రయించిన ఏథర్ ఎనర్జీ

E-scooters
Ather EV Sales June 2023: Ather Energy గత నెలలో భారతదేశంలో 6,479 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ గణంగాకాలను బట్టి చూస్తే అమ్మకాల్లో 57.5 శాతం MoM క్షీణించినట్లు తెలుస్తోంది. FAME 2 సబ్సిడీలు తగ్గిపోవడం కారణంగా స్కూటర్ల ధరలు పెరిగిపోవడంతో EV అమ్మకాలు తగ్గిపోయినట్లు కంపెనీ అంచనా వేసింది.ఏథర్ ఎనర్జీ జూన్ 2023 నెలలో దాని విక్రయాల గణాంకాలను వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ గత నెలలో భారతదేశంలో 6,479 యూనిట్లను విక్రయించగలిగింది. తక్కువ బేస్ కారణంగా 100.5 శాతం YY వృద్ధిని నమోదు చేసింది. అయితే.. MoM ప్రాతిపదికన.. కంపెనీ అమ్మకాలు 57 శాతానికి పైగా క్షీణించాయి. జూన్ 2022లో, దాని దేశీయ విక్రయాలు 3,231 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది మేలో, అథర్ 15,256 యూనిట్లను విక్రయించగలిగింది.అమ్మకాల గణాంకాలపై ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా మాట్లా...
భారతదేశంలో అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్

భారతదేశంలో అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్

E-scooters
బెంగుళూరు : భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) బుధవారం దేశంలోనే అతిపెద్ద గిగాఫ్యాక్టరీ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. తమిళనాడులోని కృష్ణగిరిలో కంపెనీ తన సెల్ ఫ్యాక్టరీకి సంబంధించి మొదటి పిల్లర్‌ను భిగించి పనులను మొదలు పెట్టింది. Ola Gigafactory అత్యంత వేగవంతగా నిర్మించిన సెల్ ఫ్యాక్టరీలలో ఒకటిగా నిలవనుంది. తయారీ రంగం లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, అలాగే  EV విప్లవంలొ భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ ఫ్యాక్టరీ దోహదపడుతుందని కంపెనీ ప్రకటించింది. .సుమారు 115 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓలా గిగాఫ్యాక్టరీ వచ్చే ఏడాది ప్రారంభంలో 5 GWh ప్రారంభ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇది దశలవారీగా 100 GWhకి విస్తరించబడుతుంది. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత ఓలా గిగాఫ్యాక్టరీ భారతదేశంలోనే అతిపెద్ద సెల్ ఫ్యాక్టరీ అ...
Simple Energy నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు

Simple Energy నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు

E-scooters
సింపుల్ ఎనర్జీ (Simple Energy) రాబోయే త్రైమాసికంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాని ఫ్లాగ్‌షిప్ వెహికిల్ అయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే.. దానికంటే తక్కువ ధరలో ఉండే రెండు కొత్త ఇ-స్కూటర్లను అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తోంది.ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న వేరియంట్‌లను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడానికి సింపుల్ ఎనర్జీ కృషి చేస్తోంది. మరిన్ని మోడళ్లతో సింపుల్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియో మరింత అందుబాటులోకి వస్తుంది.Simple Energy  సింపుల్ వన్ డెలివరీలు దశలవారీ డెలివరీ ప్లాన్‌లో భాగంగా జూన్ 6న బెంగళూరులో ప్రారంభమయ్యాయి. సింపుల్ వన్ 5kWh ప్యాక్‌తో 212కిమీల రేంజ్ ని అందిస్తుంది, ఇది పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది.సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఉన్న హైస్పీడ్ స్కూటర్లలో ప్రధానమైనద...
చవకైన వడ్డీ రేటుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు

చవకైన వడ్డీ రేటుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు

EV Updates
జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధితో  ఆఫర్ బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, 2W సెగ్మెంట్‌లో S1 స్కూటర్ పై ఫైనాన్సింగ్ ఆఫర్లను అందిస్తోంది. IDFC ఫస్ట్ బ్యాంక్, L&T ఫైనాన్షియల్ సర్వీసెస్‌ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల భాగస్వామ్యంతో జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99% వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ ని ఇంటికి తీసుకువెళ్లవచ్చు. కస్టమర్లు ఇప్పుడు అతి తక్కువ నెలవారీ EMIలతో, జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్‌ కి యజమాని అవ్వవచ్చు.ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ: “మార్కెట్ లీడర్‌గా, మేము ప్రముఖ ఫైనాన్సింగ్ భాగస్వాములతో  ఒప్పదందాలను ఏర్పరచుకున్నాము. టైర్ 1 లోనే కాకుండా టైర్ 2, 3 నగరాల్లో కూడా అత్యంత లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తున్నాము. భారతదేశం EV 2W స్వీకరణకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. మా ఫైనాన్సింగ్ ఆఫర్‌లు పరి...
Volvo C40 Recharge SUV వస్తోంది..

Volvo C40 Recharge SUV వస్తోంది..

Electric cars
ఫుల్ ఛార్జ్‌పై 530కి.మీ రేంజ్.. లాంచ్ ఎప్పుడంటే? Volvo C40 Recharge SUV : ప్రముఖ వోల్వో కార్ ఇండియా (Volvo Car India) తన రెండో ఎలక్ట్రిక్ వాహనం (Volvo C40) రీఛార్జ్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV వచ్చే ఆగస్టులో భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇక, ఈ కారు డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. వోల్వో XC40 రీఛార్జ్ అనే మరో ఎలక్ట్రిక్ SUVని కంపెనీ అందిస్తోంది. వోల్వో C40 రీఛార్జ్ అనేది ఒక ఎలక్ట్రిక్ (EV) వాహనం.అంటే.. ఎలక్ట్రిక్ కారుగా గ్రౌండ్-అప్‌గా అభివృద్ధి చేసింది. మరోవైపు వోల్వో XC40 రీఛార్జ్ ఇంటర్నల్ కర్బన్ ఇంజిన్ (ICE) ప్రతిరూపాన్ని కలిగి ఉంటుంది. కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (CMA) ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించిన ఈ ఇండియా-స్పెక్ వోల్వో C40 రీఛార్జ్ మోడల్ 408hp, 660Nm అవుట్‌పుట్‌తో ట్విన్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుంది.78kWh బ్యాటరీ ద్వారా శక్తిని అందిస్తుంది. వోల్వో C...
మాటర్ ఎరా నుంచి త్వరలో మరిన్ని వేరియంట్లు

మాటర్ ఎరా నుంచి త్వరలో మరిన్ని వేరియంట్లు

E-bikes
ఇందుకోసం రూ.577కోట్ల రుణాల సేకరణ అహ్మదాబాద్‌కు చెందిన స్టార్టప్ మాటర్ ఎనర్జీ (Matter) భవిష్యత్తు వృద్ధి కోసం నిధులు సమకూర్చుకునేందుకు ఈక్విటీ, రుణాల ద్వారా $70 మిలియన్లను (రూ. 577 కోట్లు) సేకరించాలని మ్యాటర్ లక్ష్యంగా పెట్టుకుంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దేశం యొక్క మొట్టమొదటి గేర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ (first geared electric motorcycle) అయిన Aera electric motorcycle, ఇప్పటికే 40,000 బుకింగ్‌లను సాధించింది. ప్రస్తుతం, కంపెనీ తమ పరిశ్రమ సంవత్సరానికి 60,000 యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్ధ్యంకలిగి ఉంది. మ్యాటర్ వ్యవస్థాపకుడు & CEO మోహల్ లాల్‌భాయ్ మాట్లాడుతూ.. “మేము సెప్టెంబరులో డెలివరీలను ప్రారంభించే లక్ష్యంతో ఉన్నాము. ప్రీబుక్ చేసినవారి కోసం అతి త్వరలో టెస్ట్ రైడ్‌లను ప్రారంభిస్తాము. ఆ తర్వాత వినియోగదారులకు బుకింగ్ స్టార్ట్ చేస్తాము. ”అని అన్నారు.FAME 2 సబ్సిడీలో సవరణ కారణంగ...
ఒక్క నెలలోనే 35వేల యూనిట్ల అమ్మకాలు

ఒక్క నెలలోనే 35వేల యూనిట్ల అమ్మకాలు

EV Updates
మే 2023లో Ola Electric ఘనత పెరిగిన S1, S1 ప్రో వాహనాల ధరలు   బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)  మే 2023 నెలలో తన విక్రయాల గణాంకాలను వెల్లడించింది. గత నెలలో 35,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది 303 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో ఓలా ఈవీ కేవలం 8,681 యూనిట్లను మాత్రమే విక్రయించింది. 303శాతం వృద్ధి మే 2023లో 35,000కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది, అమ్మకాలలో 303 శాతం , 16.6 శాతం MoM వృద్ధిని నమోదు చేసింది. మే 2022లో, దాని అమ్మకాలు 8,681 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ 30,000 యూనిట్లకు పైగా విక్రయించింది. Ola ఇటీవల భారతదేశంలో తన 500వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి 1,000 రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ప...
టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఈవీ.. Tata Nexon EV Max XZ+ Lux

టాటా మోటార్స్ నుంచి సరికొత్త ఈవీ.. Tata Nexon EV Max XZ+ Lux

Electric cars
Tata Nexon EV Max XZ+ Lux : టాటా మోటార్స్ కొన్ని అదనపు ఫీచర్లతో  అప్డేట్ చేసిన Nexon EV Max XZ+ని విడుదల చేసింది. ఇది ఇప్పుడు నెక్సాన్ EV మ్యాక్స్ లైనప్ లో టాప్-స్పెక్ వేరియంట్.  దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.79 లక్షలు. Nexon EV ప్రైమ్, Nexon EV మ్యాక్స్ యొక్క వేరియంట్ వారీ ధరలు ఈ విధంగా ఉన్నాయి.Nexon EV  ప్రైమ్: వేరియంట్ వారీ ధరలు (ఎక్స్-షోరూమ్)XM రూ.14.49 లక్షలు XZ+ రూ.15.99 లక్షలు XZ+ లక్స్ రూ. 16.99 లక్షలు డార్క్ XZ+ రూ.16.19 లక్షలు డార్క్ XZ+ లక్స్ రూ.17.19 లక్షలుటాటా నెక్సన్ EV మాక్స్: వేరియంట్ వారీ ధరలు(ఎక్స్-షోరూమ్)XM రూ.16.49 లక్షలు XM 7.2 kW ఛార్జర్ రూ. 16.99 లక్షలు XZ+ రూ.17.49 లక్షలు XZ+ 7.2 kW ఛార్జర్ రూ. 17.99 లక్షలు XZ+ లక్స్ రూ.18.79 లక్షలు XZ+ లక్స్ 7.2 kW హార్గర్ రూ.19.29 లక్షలు డార్క్ XZ+ లక్స్ రూ.19.04 లక్షలు డార్క్ XZ+...
ఎలక్రిక్ వాహనాలు కొనడానికి ఇదే సమయం

ఎలక్రిక్ వాహనాలు కొనడానికి ఇదే సమయం

EV Updates
జూన్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయ్.. రూ.35వేల వరకు ఆదా చేసుకోండిభారతదేశంలో కొన్నాళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే వీటి నిర్వహణ చాలా తక్కువ. అందుకే వినియోగదారులు వీటిపై మొగ్గు చూపడం ఇటీవల ఎక్కువైంది. అయితే జూన్ 1, 2023 నుంచి EVలు ఖరీదు కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై FAME 2 సబ్సిడీ మొత్తాన్ని తగ్గించేందుకు సిద్ధమైంది. ఇది సహజంగా అన్ని ఈవీలకు వర్తించనుంది. ఫలితంగా ప్రస్తుతం ఓలా, ఏథర్, బజాజ్ చేతక్, TVS iQube లేదా మరేదైనా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ధరలు ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ. 35,000 వరకు ఆదా చేయవచ్చు.అసలు FAME 2 సబ్సిడీ ఏంటీ? పర్యావరణ అనుకూల వాహనాల ఉత్పత్తి, అమ్మకాలను ప్రోత్సహించడానికి FAME (Faster Adoption and Manufacturing of Electric and Hybrid Vehicles in India)  పథకాన్ని కేంద్రం తొలిసారి 2015...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates