EV Charging : ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగిస్తున్నవారికి శుభవార్త.. వాహనం నడుపుతున్నపుడు బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోతుంటే మనం పడే టెన్షన్ అంతా ఇంతా కాదు.. వెంటనే చార్జింగ్ పాయింట్ల కోసం వెతికేందుకు ప్రయత్నిస్తుంటాం.. అయితే ఇలాంటి ఇబ్బందులను దూరం చేసేందుకు Google Maps ఒక కీలకమైన అప్‌డేట్‌ను అందించింది. ఎలక్ట్రిక్ వాహనదారుల కోసం Google Maps కి కొత్త ఫీచర్ ను జతచేసింది. ఇది ఎలక్ట్రిక్ కార్లను ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడున్నాయో ఈజీగా తెలుసుకునే వీలు కల్పిస్తుంది.
ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడం ఈజీ..
ప్రజలు సులభంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్‌లను సులభంగా కనుగొనేందుకు Google Maps కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ఇప్పటికే Google Mapsలో ఉంది అయితే గతంలో ఉన్న ఫీచర్ మీరు ఎంచుకున్న స్థానాల్లోని స్టేషన్‌లను మాత్రమే గుర్తించి చూపెడుతుంది.మరోవైపు, కొన్ని ఈవీ బ్రాండ్‌లు తమ ఛార్జింగ్ స్టేషన్‌ల గురించి సమాచారాన్ని వినియోగదారులకు అందించేందుకు తమ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. కానీ గూగుల్ మ్యాప్స్ తీసుకొచ్చిన ఈ కొత్త అప్‌డేట్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వస్తుంది. గూగుల్ మ్యాప్స్ మొదట్లో గూగుల్ ఇన్ బిల్ట్ వాహనాలకు మాత్రమే ఈ సర్వీస్ ను అందిస్తుంది. Google Maps ప్రకారం, AI సహాయంతో, EV ఛార్జింగ్ స్టేషన్ ఉన్న ప్రాంతాలను వినియోగదారు రివ్యూల ఆధారంగా మ్యాప్‌లో చూపిస్తుంది. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు నావిగేషన్ టెక్నాలజీతో EV ఛార్జింగ్ స్టేషన్‌లను చూపిస్తుంది. EV ఛార్జింగ్ స్టేషన్‌ను కనుగొనడంలో సహాయం చేయడమే కాకుండా, ఆ స్టేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలను కూడా గూగుల్ మీకు తెలుపుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు EV ఛార్జింగ్ స్టేషన్ కోసం సెర్చ్ చేసిన ప్రతీసారి ఛార్జింగ్ ప్లగ్, ఛార్జింగ్ కోసం వేచి ఉండే సమయం గురించి కూడా కూడా తెలుసుకోవాలనుకుంటారు. ఈ సమాచారం ఆధారంగా మీరు సంబంధిత స్టేషన్‌లో వాహనాన్ని ఛార్జ్ చేయాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు కూడా.
నోటిఫికేషన్ : ఈ ఫీచర్లు మొదట్లో Google ఇన్‌బిల్ట్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ స్థాయి తగ్గినపుడు వెంటనే, Google Map ఆటోమేటిక్‌గా EV ఛార్జింగ్ స్టేషన్‌ల సమాచారాన్ని డిస్ల్పే చేస్తుంది. ఈ ఫీచర్ US వినియోగదారుల కోసం ప్రారంభించనుంది. దీని తర్వాత ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనుంది. మన దేశంలో పెరుగుతున్న EV ఛార్జింగ్ నెట్‌వర్క్ దృష్ట్యా ఈ సేవ త్వరలో అందుతాయని భావిస్తున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
[…] […]