EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీపై కేంద్ర మంత్రి గడ్కరీ షాకింగ్ కామెంట్స్..
EV Subsidy | ఎలక్ట్రిక వాహనాలపై సబ్సిడీపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఈవీల స్వీకరణ గణనీయంగ పెరిగిందని ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. వినియోగదారులు పెట్రోల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాలను సొంతంగానే మారుతున్నారని చెప్పారు. గురువారం జరిగిన బీఎన్‌ఈఎఫ్ సమ్మిట్‌లో నితిన్ గడ్కరీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండేదని, క్రమంగా ఈవీలకు భారీగా డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి వ్యయం తగ్గిందని తెలిపారు. దీంతో సబ్సిడీ అవసరం లేదని తెలిపారు. వాహనదారులు ప్రస్తుతం ఎలక్ట్రిక్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వాహనాలను సైతం ఎంచుకుంటున్నారని, ఎలక్ట్రిక్ వాహనాలు, సీఎన్‌జీ వాహనాలకు మరింత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని తెలిపారు. పెట్రోల్, డీజిల్ వాహనాల ...