Lectrix EV | అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. ఒక్కసారి చార్జ్‌పై 100కి.మీ. స్పీడ్
Lectrix EV | ఎస్‌ఏఆర్ గ్రూప్‌నకు చెందిన లెక్ట్రిక్స్ ఈవీ (Lectrix EV) సంస్థ తక్కువ బడ్జెట్లో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను కేవలం రూ. 49,999 (ఎక్స్ షోరూం)కు విక్రయిస్తోంది. అయితే మరో కొత్త విశేషమేమిటంటే.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు బ్యాటరీ రాదు. దాని కోసం ప్రత్యేకమైన సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది..లెక్ట్రిక్స్ EV అనేది ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీ స్వాపింగ్ సేవలను అందిస్తున్న మొదటి OEM గా ఉంది.
2070 నాటికి జీరో కార్బన్ ఫుట్ ప్రింట్ లక్ష్యానికి అనుగుణంగా, లెక్ట్రిక్స్ EV భారతదేశంలో EV స్వీకరణను వేగవంతం చేసే మార్గాలపై పని చేస్తోంది . అయితే లెక్ట్రిక్స్ EV కొత్త గా రూ. 49,999 లకే ఎలక్ట్రిక్ స్కూటర్ వద్ద విడుదల చేసింది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కి.మీ రేంజ్ ఇస్తుంది. గంటకు 50 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది...