Wednesday, November 6Lend a hand to save the Planet
Shadow

UP Vehicle Policy | కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. హైబ్రిడ్ కార్ల‌పై రిజిస్ట్రేషన్ పన్ను పూర్తిగా రద్దు చేసిన యూపీ ప్ర‌భుత్వం

Spread the love

UP Vehicle Policy | లక్నో: రాష్ట్రంలో ప‌ర్యావ‌ర‌ణ హిత‌మైన‌ వాహనాలను ప్రోత్స‌హించే లక్ష్యంతో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. హైబ్రిడ్ కార్లపై రిజిస్ట్రేషన్ పన్నును పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించింది. హైబ్రిడ్ వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజుపై 100 శాతం మినహాయింపు ఇచ్చే విధానం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రభుత్వం వెల్ల‌డించింది.

కొత్త పాలసీ వ‌ల్ల‌ మారుతీ సుజుకి, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్ ఇండియా వంటి తయారీదారులకు భారీ ప్రయోజనాన్ని క‌లిగిస్తుంది. కొత్త పాలసీ (UP Vehicle Policy ) ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 3.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది కొనుగోలుదారుల‌కు నిజంగా శుభ‌వార్త..

యూపీ ప్రభుత్వం ప్రస్తుతం రూ. 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 8 శాతం రోడ్డు పన్ను, రూ. 10 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాహనాలపై (ఎక్స్-షోరూమ్) 10 శాతం పన్ను విధిస్తోంది. హైబ్రిడ్ వాహనాల అమ్మకాలు తక్కువగా ఉన్నందున రోడ్డు పన్ను మినహాయింపు రాష్ట్ర ఖజానాపై గణనీయంగా ప్రభావం చూపే అవకాశం లేదు.

గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ ట్రిమ్‌ల సగటు రిజిస్ట్రేషన్ ధర యూపీలో రూ.1.80 లక్షలకు చేరువైంది. ఇన్నోవా హైక్రాస్, ఇన్విక్టో కొనుగోలుదారులు కస్టమర్‌లు ఎంచుకున్న వేరియంట్ ను బ‌ట్టి ఆన్-రోడ్ ధరలలో రూ.3 లక్షల వరకు తగ్గింపుతో ప్రయోజనం పొందనున్నారు.

 


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *