MG New Electric Car : ఎలక్ట్రిక్ వాహన ప్రేమికులకు శుభవార్త .. ప్రముఖ కార్ల తయారీ సంస్థ MG మోటార్ ఇండియా త్వరలో మరో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. MG మోటార్ ఇండియా వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రూ. 10-15 లక్షల మధ్య ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో కంపెనీ ప్రవేశపెడుతున్న రెండవ EV కానుంది. గతంలో ఎంజీ మోటార్.. ఎలక్ట్రిక్ SUV అయిన ఎంజీ ZS EVని విక్రయించింది. అయితే ఈ కంపెనీ ప్రవేశపెట్టబోయే కొత్త ఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్ కోసం కాస్టమైజ్ చేయబడి ఉంటుంది.
MG మోటార్ ఇండియా ప్రెసిడెంట్మే, నేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ “SUV ఆస్టర్ తర్వాత మా తదుపరి ఉత్పత్తి అని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
“వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తాము EVని పరిచయం చేయబోతున్నామని ప్రకటించారు. ఇది రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఇది వ్యక్తిగత ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన వివరించారు. ఇది భారతదేశ మార్కెట్ కోసం దేశంలోని నిబంధనలుచ కస్టమర్ ప్రాధాన్యతలకు అనుకూలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
MG New Electric Car ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలో MG మోటార్ ఇండియా గతంలో ZS ఎలక్ట్రిక్ కారును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది రూ.21లక్షల నుంచి రూ. 24.68 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో రెండు వేరియంట్‌లలో భారతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
మరిన్ని అప్‌డేట్‌ల కోసం హరితమిత్ర వెబ్‌సైట్‌ను సందర్శించండి.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన వీడియోల కోసం మా Haritha mithra YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి..!
Nice