స్పెసిఫికేషన్స్.. రేంజ్, ధర వివరాలు ఇవీ..
భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద కార్ల తయారీ / అతిపెద్ద ఎగుమతిదారు అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, ఈ సంవత్సరం తన వరల్ట్ వైడ్ పాపులర్ ఈవీ అయిన Ioniq 5 ను భారతదేశంలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో Hyundai IONIQ 5 EV విడుదల కానుంది.
భారతదేశంలో 2028 నాటికి హ్యుందాయ్ ఆరు BEVలను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో కోనా ఎలక్ట్రిక్ SUVని విడుదల చేసిన విషయం తెలిసందే. మొదటి రాబోయే నెలల్లో దాని రెండవ EV – Ioniq 5 ను విడుదల చేయనుంది. హ్యుందాయ్ గ్లోబల్‌లో భాగమైన కియా ఇండియా, కియా EV6 ప్రీమియం ఎలక్ట్రిక్ కారును పరిమిత బ్యాచ్‌లో త్వరలో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. Kia మే 2022లో EV-6 బుకింగ్‌లను ప్రారంభించనుంది.
481km డ్రైవింగ్ రేంజ్
IONIQ 5 హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP) ఆధారంగా రూపొందించబడింది. హ్యుందాయ్ యూరోప్-స్పెక్ IONIQ 5ని నాలుగు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తుంది. అందులో మొదటి రెండు 170PS ఎలక్ట్రిక్ మోటారు, 217PS ఎలక్ట్రిక్ మోటారు, రెండూ వెనుక చక్రాలను నడిపిస్తాయి. ఇక మూడు, నాలుగు ఆల్-వీల్ డ్రైవ్‌ట్రెయిన్‌తో 233PS, 305PS మోటార్ ఉంటాయి. ఇది రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో (58kWh, 72.6kWh) అందుబాటులో ఉంటాయి. ఇవి వరుసగా 384km, 481km డ్రైవింగ్ రేంజ్‌ని ఇస్తాయి.
హ్యుందాయ్ భారతదేశంలో Ioniq 5ని అనేకసార్లు ప్రదర్శించింది. ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (E-GMP) అనేది నెక్ట్స్ జనరేషన్ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన ఒక వినూత్న వ్యవస్థ. ఇది వినూత్నమైన ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. E-GMP పెద్ద బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది, మెరుగైన హ్యాండ్లింగ్ మరియు 260 kmph గరిష్ట వేగాన్ని సాధించగలదు.
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, MD & CEO, Unsoo కిమ్ మాట్లాడుతూ, “కస్టమర్ సెంట్రిక్ బ్రాండ్‌గా, హ్యుందాయ్ ఎలక్ట్రిక్ మొబిలిటీపై చాలా బలంగా దృష్టి సారిస్తోంది. Hyundai IONIQ 5 EV వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022ని అందుకోవడం గర్వంగా ఉందని తెలిపారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా 2028 నాటికి 6 Electric Cars ను తీసుకురానుంది . మేము భారతదేశంలో CY 22లో IONIQ 5ని పరిచయం చేస్తామని తెలిపారు.