సరికొత్త త్రీవీలర్‌ను విడుదల చేసిన Omega Seiki Mobility
ఎక్స్‌షోరూం ధర రూ.5లక్షలతో ప్రారంభం
ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) తన కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్ electric three-wheeler.. Vicktor విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5 లక్షలు. ప్రభుత్వ సబ్సిడీ.. మొదటి 100 మంది వినియోగదారులకు ఈ ధర వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.
Vicktor electric three-wheeler 20 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 250 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అవి 1.ఓపెన్, 2.క్లోజ్డ్. కస్టమర్‌లు తమ వ్యాపార అవసరాలను బట్టి వీటిని ఎంచుకోవచ్చు.
9,999 బుకింగ్ మొత్తానికి Omega Seiki Mobility (OSM) డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. డెలివరీలు నవంబర్ 2022 నుండి ప్రారంభమవుతాయి. Vicktor three-wheeler ఇ-కామర్స్ రంగంలో లాజిస్టిక్స్, డెలివరీ అవసరాలను తీరుస్తుంది.
Omega Seiki మొబిలిటీ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ఉదయ్ నారంగ్ మాట్లాడుతూ “లాస్ట్ మైల్ డెలివరీ, లాజిస్టిక్స్ విభాగంలో విశ్వసనీయమైన కార్గో రవాణాను ప్రారంభించడానికి లాంగ్ రేంజ్ ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల అవసరం ఉంది అని తెలిపారు. “ఒకే ఛార్జ్‌లో 250 కి.మీల రేంజ్‌ను అందించే Vicktor electric three-wheeler ని ప్రారంభించడంపై సంతోషిస్తున్నాము. ఈ వాహనం ప్రపంచ పటంలో భారతదేశ కీర్తిని ప్రదర్శించే సరికొత్త సాంకేతికత, పవర్-ప్యాక్డ్ పనితీరును కలిగి ఉందని పేర్కొన్నారు.
“మేము త్వరలో Auto Expo 2022 లో మరిన్ని విప్లవాత్మక ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించనున్నామని చెప్పారు.
అధిక స్థాయి EVల ఉత్పత్తిని సాధించే ప్రయత్నంలో కొత్త శ్రేణి పవర్‌ట్రైన్‌ల తయారీకి కొరియన్ కంపెనీ జే సంగ్ టెక్‌తో కలిసి జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. Omega Seiki మొబిలిటీ కూడా అంతర్గత మోటార్లు, బ్యాటరీ ప్యాక్‌లను తయారు చేయడానికి ప్లాన్ చేస్తోంది.