2021 EV ఎక్స్‌పోలో అదిరిపోయే వాహనాలు
కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించిన కంపెనీలు దేశరాజధాని న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇటీవల11 వ EV Expo 2021 ప్రారంభమైంది. మూడు రోజుల ఈ ఈవెంట్‌లో 100 కి పైగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ సరికొత్త దిచక్రవాహనాలు, త్రీవీలర్లు, ఫోర్ వీలర్లను ఆవిష్కరించాయి. అలాగే ఇ-వాహనాలకు సంబంధించిన విడి భాగాలు, ఉపకరణాలు, ఛార్జింగ్ సొల్యూషన్స్, ప్రదర్శిస్తున్నారు. ఈ EV Expo 2021 సరకొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన సమగ్ర సమాచారం. గొప్ప వ్యాపార అవకాశం, నెట్‌వర్కింగ్ సంబంధించి ఒక వేదికగా నిలిచింది.
EV Expo 2021లో EV లాంచ్‌లు
ఎలక్ట్రిక్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో కొత్త లాంచ్‌లు, అలాగే బ్యాటరీ, ఛార్జింగ్ సౌకర్యాల వంటివాటిని EV తయారీదారులు తమ ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
సుప్రీం స్మార్ట్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ ఇ -బైక్‌లు అయిన ‘హేలియోస...