Hero electric, చార్జర్ భాగస్వామ్యంతో ఏర్పాటు
దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన Hero electric.. బెంగళూరుకు చెందిన EV ఛార్జింగ్ స్టార్ట్-అప్ అయిన చార్జర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హీరో ఎలక్ట్రిక్ – చార్జర్ సంస్థలు సంయుక్తంగా వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 1,00,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. మొదటి సంవత్సరం చార్జర్ దేశంలోని టాప్ 30 నగరాల్లో 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఇది వినియోగదారులకు ఛార్జింగ్ సదుపాయాన్ని సులభతరం చేయడానికి హీరో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో కిరానా చార్జర్‌ను కూడా అమలు చేస్తుంది. ఇది సమీప ఛార్జింగ్ స్టేషన్‌లు, బుకింగ్ స్లాట్‌లను గుర్తించడానికి EV యజమానుల కోసం Charzer మొబైల్ అప్లికేషన్‌తోపాటు వెబ్‌సైట్‌ను కూడా అందిస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్ రైడర్‌లు సబ్‌స్క్రిప్షన్ ఆధారిత మోడల్‌లో ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా ఉపయోగించవచ్చు.
చార్జర్ సంస్థతో భాగస్వామ్యంపై హీరో ఎలక్ట్రిక్హీరో ఎలక్ట్రిక్ CEO సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. భారతదేశంలో EVల అభివృద్ధికి బలమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నెట్‌వర్క్ కీలకమని అన్నారు. చార్జర్‌తో ఒప్పందం EV వృద్ధికి సాయపడుతుందని తెలిపారు. ఛార్జర్ ద్వారా అమర్చబడిన ఛార్జర్‌లతో ఛార్జింగ్ స్లాట్ బుకింగ్ అలాగే పేమెంట్ చేయడం ద్వారా కస్టమర్‌లకు సులభతరమైన ఛార్జింగ్ అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథం, నిబద్ధతతో, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడానికి రెండు బ్రాండ్‌లు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా, గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.
Charzer అనేది పబ్లిక్ స్థలాలు, అపార్ట్‌మెంట్‌లు, కార్యాలయాల కోసం ఛార్జింగ్ సొల్యూషన్‌లను అందించే EV స్టార్ట్-అప్. ఈ ఛార్జర్‌లు అన్ని EV మోడళ్లకు అనుకూలంగా ఉంటాయి. ఇంటెలిజెంట్ సాఫ్ట్‌వేర్ ద్వారా పనిచేసే ఈ చార్జర్ నిపుణుల సాయంతో ఇన్‌స్టాల్ చేసి వినియోదగారులకు సర్వీస్ అందిస్తాయి. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, పూణె, ఢిల్లీ, మంగళూరుతో సహా 20 నగరాల్లో విస్తరించి ఉంది.