Solar Energy | రికార్డు స్థాయికి భారతదేశ సౌర ఉత్పత్తి ఎగుమతులు.. రెండేళ్లలో 20 రెట్లు జంప్
Solar Energy | సోలార్ ఉత్పత్తుల్లో భారత్ ఎదురులేకుండా దూసుకుపోతోంది. ఒక తాజా నివేదిక ప్రకారం.. భారతదేశ సోలార్ ఫోటోవోల్టాయిక్ (Solar Photovoltaic (PV) ఉత్పత్తుల ఎగుమతులు FY22 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం (FY)లో 23 రెట్లు పెరిగి $2 బిలియన్లకు చేరుకున్నాయని తేలింది.ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (IEEFA), JMK రీసెర్చ్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం, నికర దిగుమతిదారు నుంచి సౌర ఉత్పత్తుల నికర ఎగుమతిదారుగా భారతదేశం మారింది. తాజాగా ఇతర దేశాలు ఇప్పుడు తమ "చైనా ప్లస్ వన్" వ్యూహానికి భారతదేశాన్ని అత్యుత్తమ ఎంపికగా భావిస్తున్నారు. దేశీయ PV తయారీదారులు తమ ఉత్పత్తులను విదేశాలలో అధిక ప్రీమియంతో విక్రయించాలని చూస్తున్నారు.మార్కెట్ల పరంగా, భారతీయ సోలార్ సోలార్ ఫోటోవోల్టాయిక్ (PV ఎగుమతులకు యుఎస్ కీలక మార్కెట్‌గా అవతరించింది. FY2023 మరియు FY2024 రెండింటిలోనూ భారతీయ సోలా...