Friday, March 14Lend a hand to save the Planet
Shadow

Tata Nexon EV Discount | టాటా నెక్సాన్ EV కొనుగోలు ఇదే సరైన సమయం.. రూ.2 లక్షల వరకు తగ్గింపు

Spread the love

Tata Nexon EV Discount | టాటా మోటార్స్ Nexon EVపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఇది ఇటీవల విడుదల చేసిన Curvv EV ప్రభావమై ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. టాటా క‌ర్వ్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధ‌ర‌ రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఎల‌క్ట్రిక్ కారు కొనాల‌నుకున్న‌వారికి Nexon EV ఇప్పుడు బెస్ట్ ఆప్ష‌న్ గా చెప్ప‌వ‌చ్చు. అయితే, డీలర్‌షిప్‌లలో ఈ డిస్కౌంట్లు వేర్వేరుగా ఉండవచ్చని గుర్తుంచుకోవాలి.

Tata Nexon EV Discount

టాటా మోటార్స్ నెక్సాన్ EV తో రూ. 1.80 లక్షల వరకు భారీ డీల్‌లను ఆఫర్ చేయడంతో డిస్కౌంట్ గేమ్‌ను పెంచింది . EV టాప్-ఆఫ్-ది-లైన్ ఎంపవర్డ్+ LR సిరీస్ గరిష్టంగా రూ.1.80 లక్షల వరకు డిస్కౌంట్ తో వస్తుంది. ఇది మునుపటి ఆఫర్ కంటే రూ. 50,000 ఎక్కువ. ఎంట్రీ-లెవల్ క్రియేటివ్+ MRపై రూ. 20,000 తగ్గింపు, ఫియర్‌లెస్ MR, ఫియర్‌లెస్ + MR వేరియంట్‌లపై ఫ్లాట్ రూ. 1 లక్ష తగ్గింపు అలాగే ఎంపవర్డ్‌పై రూ. 1.2 లక్షల డిస్కౌంట్ ల‌భించ‌నుంది.

భారతీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ లాంగ్ రేంజ్ లైనప్‌పై మెరుగైన డీల్‌లను అందిస్తోంది, ఫియర్‌లెస్ రేంజ్ రూ. 1.2 లక్షలు త‌గ్గింపు ఉంది. ఇది మునుపటి ప్రయోజనాల కంటే రూ. 50,000 ఎక్కువ. ఎంప‌వ‌ర్డ్ +LR, డార్క్ ఎంపవర్డ్ +LR రెండూ రూ. 1.80 లక్షల విలువైన ప్రయోజనాలను అందిస్తాయి.

టాటా నెక్సాన్ EV: స్పెక్స్

Nexon EV రెండు బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది. అవి 30 kWh మరియు 40.5 kWh. ఎంట్రీ-లెవల్ వెర్షన్ లేదా మీడియం రేంజ్ (MR) 127 bhp, 215 Nm అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. ఇది 9.2 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. టాప్ మోడల్ లేదా లాంగ్-రేంజ్ (LR) 143 bhp, 215 Nm ఇది 8.9 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. టాటా మోటార్స్ ప్రకారం.. నెక్సాన్ డ్రైవింగ్ రేంజ్‌ 465 కి.మీ. దీని ధర రూ. 14.49 లక్షల నుంచి రూ. 19.29 లక్షల వరకు ఉంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..