వావ్.. వ్యర్థాలతో Electric tricycle
త్రీడీ ప్రింట్ టెక్నాలజీతో ZUV Electric tricycleఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త ఆవిష్కరణ. 3D ప్రింటెడ్ టెక్నాలజీతో వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి ఒక కాన్సెప్ట్ ట్రైసైకిల్‌ను రూపొందించారు. 70 కిలోల రీసైకిల్ ప్లాస్టిక్‌తో EOOS NEXT అనే సంస్థ ZUV Electric tricycle ను రూపొందించింది.సింగిల్ చార్జిపై 50కి.మి రేంజ్
ZUV tricycle పై ఇద్దరు ప్రయాణికులు కూర్చోవచ్చు. ముందు భాగంలో ఉన్న బాక్స్‌లో ఇద్దరు చిన్న పిల్లలు లేదా ఏదైనా సామగ్రిని తీసుకెళ్లవచ్చు. ఈ సైకిల్‌కు పెడల్స్ ఉండవు. దీని వెనుక హబ్ మోటార్ ద్వారా ఈ సైకిల్ ముందుకు కదులుతుంది. రెండు ముందు చక్రాలకు స్టీరింగ్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ZUV ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ పట్టణ ప్రాంతాలలో 25 km/h గరిష్ట వేగంతో వెళ్లవచ్చు. ఒక్కసారి చార్జి చేస్తే సుమారు 50 కిమీ ప్రయాణించవచ్చు. మొత్తంగా, ZUV బరువు సుమారు 100 కిలోలు ఉంటుంది. ఈ సైకి...