భారతదేశపు మొట్టమొదటి ADAS-అమర్చిన ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్.. 15 నిమిషాల చార్జితోనే 100కిమీ రేంజ్
Storm EV Electric Cargo Vehicles | ఇంటర్‌సిటీ, ఇంట్రాసిటీ రవాణా కోసం రూపొందించిన Storm EV ఎలక్ట్రిక్ కార్గో వాహనాలను Euler Motors కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఇందులో రెండు మోడళ్లు మొదటిది Storm EV LongRange 200 (intercity) కాగా, రెండవది Storm EV T1250 (ఇంట్రాసిటీ). ఇవి రెండూ 1250 Kg పేలోడ్ కెపాసిటీతో వస్తాయి. 4W లైట్ కమర్షియల్ వెహికల్ (LCV) సెగ్మెంట్‌లోకి కంపెనీ అడుగుపెట్టింది. Storm EV LongRange 200 ఎక్స్ షోరూం ధర రూ. 12.99 లక్షలు కాగా, Storm EV T1250 ధర రూ. 8.99 లక్షలుగా ఉంది.కొత్త వాహనాల లాంచ్‌లతో Euler Motors 10 ఇతర సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో పాటు భారతదేశంలో LCV విభాగంలో మొదటిసారిగా ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ని కూడా ప్రవేశపెట్టింది .స్టార్మ్ EV లాంగ్ రేంజ్ 200 - నగరాల మధ్య కార్గో మొబిలిటీని ప్రారంభించడానికి 200 కి.మీ పరిధితో ఇంటర్‌సిటీ ఉపయోగం కోసం రూపొంది...