Green Energy | రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీకి ప్రణాళికలు..
Green Energy in Telangana | రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2029-2030 వరకు 20,000 మెగా వాట్ల వరకు గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళిక లను రూపొందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka Mallu ) తెలిపారు. రాష్ట్రంలో పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతున్నందున విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని అన్నారు. అందుకు కావాల్సిన బడ్జెట్తో ముందుకు పోతున్నామని భట్టివిక్రమార్క తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పడకుండా కావాల్సిన అదనంగా ట్రాన్స్ ఫార్మర్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి రైతులకు పంటతో పాటు కరెంటుతో ఆదాయం వచ్చేలా వ్యవసాయ పంపు స...