Home » Ampere | గుడ్ న్యూస్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.10000 తగ్గింపు
Ampere electric scooters

Ampere | గుడ్ న్యూస్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.10000 తగ్గింపు

Spread the love

Ampere : ఇటీవలే ఆంపియర్ కొత్త నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Nexus) ను విజయవంతంగా ప్రారంభించిన తర్వాత,ఈ కంపెనీ తన పాత మోడళ్లలో కొన్నింటిని మరింత తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడానికి నిర్ణయించుకుంది. అందులో అంపియర్ రియో లి ప్లస్, మాగ్నస్ ఎల్‌టి, మాగ్నస్ ఇఎక్స్ మోడళ్లపై రూ.10,000 ధర తగ్గించినట్లు ఆంపియర్ ప్రకటించింది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటరల్లో Magnus మోడల్ ఎంతో పాపులర్ అయింది. మాగ్నస్ రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి Magnus LT,  Magnus EX.  తాజాగా ఈ మోడల్ ధరలు తగ్గించిన తరువాత ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 84,900. రూ. 94,900 లకు అందుబాటులో ఉంది. ఇందులో 60V/28Ah బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంది, ARAI-క్లెయిమ్ చేసిన పరిధి 84km, కంపెనీ క్లెయిమ్ చేయబడిన గరిష్ట వేగం 50kph.

Ampere Nexus : త‌క్కువ ధ‌ర‌లోనే ఆంపియ‌ర్ నెక్స‌స్ స్కూట‌ర్ వచ్చేసింది… ఫీచర్లు, ధరల వివరాలు ఇవే..

ఇక Ampere Rio Li Plus మోడళ్ల ధరలను కూడా తగ్గించింది. రియో లి ప్లస్ ఇప్పుడు రూ. 59,900 (ఎక్స్-షోరూమ్)కి అందుబాటులో ఉంది. రియో లి ప్లస్ ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది ప్రధానంగా నగరంలో తక్కువ వేగం, తక్కువ దూరాల వరకు ప్రయాణించేవారి కోసం రూపొందించింది. ఇది 1.3kWh లిథియం-అయాన్ బ్యాటరీతో అమర్చబడి ఉంది. ఇది డిటాచబుల్. సింగిల్ చార్జిపై  70km వరకు మైలేజీ ఇస్తుంది.  Rio Li Plus గంటకు 25kph గరిష్ట వేగంతో వెళ్తుంది. తక్కువ-స్పీడ్ ఇ-స్కూటర్  కావడం వల్ల దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు అవసరం లేదు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి.. కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ
ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి.. కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ