హైదరాబాద్‌లో Battery Swap Station
HPCL, RACEnergy భాగస్వామ్యంతో ఏర్పాటు
Battery Swap Station : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన RACEnergy, భారతదేశంలోని అతిపెద్ద ఇంధన సంస్థల్లో ఒకటైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో జట్టు కట్టింది. ఈ రెండు సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాద్‌లో తన మొదటి బ్యాటరీ స్వాప్ స్టేషన్‌ను బుధవారం ప్రారంభించింది. ఎలక్ట్రిక్ టూ వీలర్, త్రీ వీలర్ వాహనాల కోసం వీటిని నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలు & వాణిజ్యం (I&C), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ఇటీవల IKEA ఎదురుగా ఉన్న HITEC సిటీలో మొదటి స్టేషన్‌ను RACEnergy CTO, సహ వ్యవస్థాపకుడు గౌతం మహేశ్వరన్ ప్రారంభించారు.హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రదేశాలలో ఉన్న HPCL అవుట్‌లెట్‌లలో మూడు బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లను జనవరి 2022లో ఏర్పాటు చేయనున్నారు....