
మార్కెట్‌లోకి కొత్తగా Wroley E-Scooters
ఫీచర్లు, ధరల వివరాలు ఇవిగో..
Wroley E-Scooters అనే సంస్థ దేశీయ మార్కెట్‌లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. Mars ( మార్స్), Platina (ప్లాటినా), Posh (పోష్) అనే మూడు బడ్జెట్ ఫ్రెండ్రీ ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ సొంత స్టైల్ తో వస్తున్నాయి. ఈ స్కూటర్లు ఢిల్లీలోని అన్ని Wroley డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోదగిన విశేషమేంటంటే.. ఈ స్కూటర్‌ల బ్యాటరీపై కంపెనీ 40,000కిమీల వరకు వారంటీని అందిస్తోంది. ఈ కొత్త స్కూటర్లో రివర్స్ మోడ్, యాంటీ-థెఫ్ట్ సెన్సార్, సైడ్-స్టాండ్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్ వంటి స్మార్ట్ ఫీచర్లను అందిస్తున్నారు.
Wroley Mars Electric Scooter
Wroley Mars ఈ మూడింటిలో అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.74,900 (ఎక్స్-షోరూమ్). ఇది 60V/30Ah బ్యాటరీతో వస్తుంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90కిమీ కంటే ఎ...