
TVS Orbiter | ₹99,990 ధరలో TVS కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ “ఆర్బిటర్”
TVS Orbiter | భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ఊపందుకుంది. బడా కంపెనీలు వరుసగా అన్నివర్గాల కొనుగోలుదారులను ఆకర్షించేలా అనేక మోడళ్లను విడుదల చేస్తున్నాయి. మార్కెట్లో తాజాగా టీవీఎస్ ఆర్బిటర్ వచ్చేసింది. ఇది యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 99,990. టీవీఎస్ కంపెనీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పుడు 3 మోడల్స్, అనేక వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.కొత్త టీవీఎస్ ఆర్బిటర్ టాప్ మూడు ముఖ్యాంశాలుTVS Orbiter : డిజైన్కొత్త టీవీఎస్ ఆర్బిటర్ డిజైన్ విషయానికి వస్తే కాస్త స్పోర్టీ డిజైన్ ను కలిగి ఉంది. ఆర్బిటర్లో ఇరుకైన ఫ్రంట్ ఆప్రాన్తో కూడిన ఫ్రంట్ డిజైన్ ఉంటుంది, DRL ముందు భాగంలో కొత్త జూపిటర్ ను పోలి ఉంది. ఇక హెడ్లైట్ ఐక్యూబ్ లో మాదిరిగా కాకుండా భిన్నంగా హ్యాండిల్బార్లపై అమర్చబడి ఉంది.ఆర్బిటర్లో పొడవైన...