
EVTRIC నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోపెడ్
, సరుకుల రవాణాకు అనుకూలం
సింగిల్ చార్జిపై 110కి.మి రేంజ్EVTRIC మోటార్స్ సంస్థ మరో ఎలక్ట్రిక్ వెహికల్‌ను విడుదల చేసింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇటీవల జరిగిన EV ఎక్స్పో 2021 లో తన B2B E- డెలివరీ స్కూటర్‌ను ప్రదర్శించింది. ఈ స్కూటర్ సరుకుల డెలివరీ కోసం ఉద్దేశించింది. ఇందులో సరుకులను ఉంచేందుకు అదనపు క్యారియర్లతో వస్తుంది. ఇది లోస్పీ్ వెహికిల్ గంటకు 25 కిమీ వేగంతో వెళ్తుంది. ఈ స్కూటర్ స్థానిక వ్యాపారాల డెలివరీలకు చక్కగా సరిపోతుంది. ఇందులో 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. 150 కిలోల లోడింగ్ సామర్థ్యం కలిగి ఉండడం దీని ప్రత్యేకత.ఈ స్కూటర్లోని లిథియం-అయాన్ బ్యాటరీని ఛార్జ్ కావడానికి సుమారు మూడున్నర గంటలు పడుతుంది. ఇది డిటాచబుల్ బ్యాటరీ. స్కూటర్ నుంచి విడదీసి చార్జ్ పెట్టుకోవచ్చు. ఒక్కసారి చార్జి చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు...