
CNG two-wheeler | త్వరలో TVS నుంచి సీఎన్జీ స్కూటర్.. జూపిటర్ స్కూటర్ ఇక సీఎన్జీ వేరియంట్ లో..
CNG two-wheeler | ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ అయిన బజాజ్ ఫ్రీడమ్ 125 ని గత వారం విడుదల చేసిన విషయం తెలుసిందే.. ఇంకా ఇది మార్కెట్‌లో అమ్మకానికి రాలేదు. అయినప్పటికీ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ పై ఇప్పటికే భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్ లో అలాగే ఇంటర్నెట్‌లో సంచనలం రేపుతోంది. బైక్ డిజైన్, మైలేజీ విషయంలో అందరూ మెచ్చుకుంటున్నారు. ఇది భారతదేశంలోని ఇతర ద్విచక్ర వాహన కంపెనీల్లో విశ్వాసాన్ని పెంచింది. ఇదిలా ఉండగా దేశంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ అయిన టీవీస్ మోటార్ కంపెనీ కూడా సీఎన్‌జీ ద్విచక్రవాహనాన్ని తీసుకురావాలని చూస్తోంది.
TVS CNG 125cc స్కూటర్
ఇటీవలి ఆటోకార్ ఇండియా నివేదిక ప్రకారం.. TVS CNGతో నడిచే జూపిటర్ 125పై పని చేస్తోంది. ఇది ఫ్యాక్టరీలో అమర్చిన CNG కిట్‌తో వచ్చే ప్రపంచంలోనే మొదటి స్కూటర్‌గా అవతరించనుంది. TVS కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతిక...