
TVS iQube 3.1 kWh బ్యాటరీతో కొత్త iQube వేరియంట్‌ను జోడించింది: ధర, ఫీచర్లు ఇదే!
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో దూసుకుపోతున్న TVS Motor Company, తన పాపులర్ iQube సిరీస్‌కు కొత్త వేరియంట్‌ను జోడించింది. తాజా లాంచ్‌లో భాగంగా, బేస్ ట్రిమ్‌కి 3.1 kWh బ్యాటరీ ఎంపికను పరిచయం చేసింది. దీని ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఇప్పటి వరకూ ఉన్న బేస్ మోడల్ కంటే రూ. 12,000 ఖరీదైనది కాగా, టాప్ వేరియంట్ iQube ST కంటే రూ. 21,000 చవకగా లభిస్తుంది.TVS iQube 3.1: కొత్తవేరియంట్ లో ఏముంది?ఈ తాజా విడుదలతో, iQube ఇప్పుడు మొత్తం ఆరు వేరియంట్లలో నాలుగు బ్యాటరీ ఆప్షన్స్ లలో అందుబాటులో ఉంది. కొత్త iQube 3.1 పెర్ల్ వైట్, వాల్నట్ బ్రౌన్, టైటానియం గ్రే, కాపర్ బ్రౌన్-బీజ్, స్టార్‌లైట్ బ్లూ-బీజ్ సహా ఐదు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని ఇతర ఫీచర్ హైలైట్‌లలో 32-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, USB ఛార్...