
Simple One e-scooter బిగ్ అప్‌డేట్
జూన్ 2022 నుంచి డెలివరీలు షురూ..
Simple One e-scooter కోసం ఎదురుచూస్తున్నవారికో శుభవార్త. ఈ స్కూటర్ కోసం బుకింగ్ చేసుకున్నవారికి ఈ ఏడాది జూన్‌లో వాహనాలను డెలివరీ చేస్తామని సింపుల్‌వన్ పేర్కొంది.
బెంగళూరుకు చెందిన electric scooter స్టార్టప్.. సింపుల్ ఎనర్జీ కంపెనీ గత సంవత్సరం ఆగస్టులో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సింపుల్ ఎనర్జీ వారి వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర(ఎక్స్-షోరూమ్) రూ.1.10లక్షలతో విడుదలైంది. దీని కోసం బుకింగ్‌లు చాలా కాలం క్రితమే ప్రారంభించి ఉన్నారు. అయితే తాజాగా కంపెనీ దాని డెలివరీ టైమ్‌లైన్‌ను ప్రకటించింది.
ఈ-మొబిలిటీదే భవిష్యత్తు..
సింపుల్ వన్ స్కూటర్ గురించి సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, CEO సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. “ఎలక్ట్రిక్ మొబిలిటీదే భవిష్యత్తు అని అన్నారు. ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో విప్లవాత్మక ...