Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: Telangana news

New EV Policy | ఎల‌క్ట్రిక్ వాహ‌న కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. రేప‌టి నుంచే తెలంగాణ‌లో కొత్త‌గా ఈవీ పాల‌సీ..

New EV Policy | ఎల‌క్ట్రిక్ వాహ‌న కొనుగోలుదారుల‌కు గుడ్ న్యూస్‌.. రేప‌టి నుంచే తెలంగాణ‌లో కొత్త‌గా ఈవీ పాల‌సీ..

EV Updates
New EV Policy | రాష్ట్రంలో పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేందుకు కాలుష్యాన్ని త‌గ్గించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ఈవీ పాల‌సీని ప్ర‌వేశ‌పెట్టింది. ఇది రేప‌టి నుంచే అమ‌లులోకి రానుంది. ప్రభుత్వ ఉత్తర్వు (GO) 41 కింద తెలంగాణ తన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) విధానాన్ని రేపటి నుండి ప్రారంభించనుంది. ఈ చొరవలో భాగంగా, ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపుతో సహా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది.కొత్త ఈవీ పాల‌సీ గురించి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంద‌ని తెలిపారు. . "మేము హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నాం. హైద‌రాబాద్ లో ఢిల్లీ లో మాదిరిగా కాలుష్య స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నాము. సాంప్రదాయ ఇంధన ఆధారిత...
వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు

Green Mobility
New Electric Buses: వరంగల్ రీజియన్‌లో టీజీఎస్ఆర్టీసీ త్వరలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం, భూపాలపల్లి రూట్లలో కొత్తగా 82 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు.ఎలక్ట్రిక్ బస్సుల్లో సూపర్ లగ్జరీ (18), డీలక్స్ (14), సెమీ డీలక్స్ (21), ఎక్స్‌ప్రెస్ (29) ఉన్నాయి. ఢిల్లీకి చెందిన JBM కంపెనీ ఈ బస్సులను కాంట్రాక్ట్ (Gross cost contract) ప్రాతిపదికన నడపడానికి అంగీకరించింది. గ్రేటర్ వరంగల్ రీజియన్ పరిధిలోని బస్సులను నిర్వహిస్తున్న వరంగల్-2 డిపోలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 41 సీటింగ్ సామర్థ్యం, ​​డీలక్స్‌లో 2+2 సీటింగ్ ప్యాటర్న్‌లో 45 సీట్లు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 2+3 సీటింగ్ ప్యాటర్న్‌లో 55 సీట్లు ఉంటాయని, ముందు, వెనుక ఎయిర్ సస్పెన్షన్ ఉంటుందని అధికారులు తెలిపారు....
నేలకొరిగిన భారీ వృక్షాలకు మళ్లీ జీవం పోశారు

నేలకొరిగిన భారీ వృక్షాలకు మళ్లీ జీవం పోశారు

General News
కొత్తగూడెం: ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు నేలకొరిగిన కొన్ని దశాబ్దాల నాటి రెండు చెట్లను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌) తిరిగి నాటి వాటికి మళ్ళీ జీవం పోసింది.. కొత్తగూడెంలోని ఎస్‌సిసిఎల్‌ ప్రధాన కార్యాలయం ఆవరణలో ఉన్న ఆరు దశాబ్దాల నాటి పెద్ద మర్రిచెట్టు ఈదురు గాలులు, వర్షం కారణంగా నేలకూలింది. దీంతో  కంపెనీ డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) ఎన్ బలరామ్, చెట్టును మరో చోటికి తరలించి నాటాలని సూచించడంతో  నిపుణులు, సిబ్బంది రంగంలోకి దిగారు., చెట్టును ఎర్త్‌మూవర్ సహాయంతో లోపలి వేర్లను అతి జాగ్రత్తగా పైకి లాగి భారీ క్రేన్ సహాయంతో ట్రక్కులోకి ఎక్కించారు. కొత్తగూడెం బంగ్లా ప్రాంతంలో చెట్టును తీసుకొచ్చి నాటారు.అదేవిధంగా, స్థానిక ఇండోర్ షటిల్ కోర్టు పక్కనే ఉన్న 50 ఏళ్ల దిరిసేన (వృక్ష శాస్త్రంలో అల్బిజియా లెబ్బెక్) అని పిలువబడే మరో భారీ చెట్టు ఇటీవల కురిసిన వర్షాలకు నేలకొరిగింది. అయి...