
Simple Energy నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు
సింపుల్ ఎనర్జీ (Simple Energy) రాబోయే త్రైమాసికంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాని ఫ్లాగ్‌షిప్ వెహికిల్ అయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే.. దానికంటే తక్కువ ధరలో ఉండే రెండు కొత్త ఇ-స్కూటర్లను అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తోంది.ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న వేరియంట్‌లను వేగంగా మార్కెట్లోకి తీసుకురావడానికి సింపుల్ ఎనర్జీ కృషి చేస్తోంది. మరిన్ని మోడళ్లతో సింపుల్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియో మరింత అందుబాటులోకి వస్తుంది.Simple Energy సింపుల్ వన్ డెలివరీలు దశలవారీ డెలివరీ ప్లాన్‌లో భాగంగా జూన్ 6న బెంగళూరులో ప్రారంభమయ్యాయి. సింపుల్ వన్ 5kWh ప్యాక్‌తో 212కిమీల రేంజ్ ని అందిస్తుంది, ఇది పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది.సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఉన్న హైస్పీడ్ స్కూటర్లలో ప్రధానమైనద...