EV Charging Stations | ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల కోసం కొత్త మార్గదర్శకాలు
Charging Stations | ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) విక్రయాలు, కొనుగోళ్లను పెంచడానికి భారతదేశ వ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ప్రభుత్వం ఇటీవలే సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మధ్య భాగస్వామ్యం ద్వారా EV ఛార్జింగ్ స్టేషన్‌ల ఇన్‌స్టాలేషన్, నిర్వహణకు సంబంధించిన నిబంధనలను ఇందులో పొందుపరిచారు.విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు విస్తృత శ్రేణి EV ఛార్జింగ్ పాయింట్లకు వర్తిస్తాయి. వీటిలో ప్రైవేట్ యాజమాన్యంలోని పార్కింగ్ స్థలాలు. కార్యాలయ భవనాలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు వంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాగే, వాణిజ్య సముదాయాలు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ పంపులు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, మున్సిపల్ పార్కింగ్ స్థలాలు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు వంటి బహిరంగ ప్రదేశాలు కూడా ...