
త్వరలో మరికొన్ని Mahindra electric cars
Mahindra electric cars : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా త్వరలో మరికొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నధ్దమవుతోంది. జూలైలో సరికొత్త EV రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ వారం ప్రారంభంలో మహీంద్రా భారతదేశం కోసం తన EV ప్లాన్‌లను త్వరలో వెల్లడిస్తామని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పూర్తిగా ఎలక్ట్రిక్ XUV300 SUVని విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో భారతదేశం కోసం తన ఎలక్ట్రిక్ వాహనాల ప్లాన్‌లను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. EV రోడ్‌మ్యాప్‌ను ప్రకటించే ముందు, ఈ సంస్థ మూడు EV కాన్సెప్ట్ మోడల్‌లను టీజ్ చేసింది, అయితే ఇవన్నీ SUVలుగా కనిపిస్తున్నాయి. మహీంద్రా మూడు కార్లను ప్రదర్శిస్తూ టీజర్ వీడియోను షేర్ చేసింది.https://youtu.be/uK0I5zf7nnYరాబోయే Mahindra electric cars బోర్న్ ఎలక్ట్రిక్ విజ...