Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: Telangana

ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు

ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు

Agriculture
Cotton Farmers | హైదరాబాద్ : పత్తి రైతుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ సేవలను ప్రారంభించింది. వాట్సప్ నంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సన్నద్ధమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. పత్తి కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే సమయం వంటి ముఖ్యమైన వివరాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ వాట్సప్ నంబరు ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులందరూ మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన ఈ వాట్సప్ యాప్ ను ఉపయోగించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పత్తిని విక్రయించుకోవాలని రైతులను కోరారు. అలాగే, రైతులకు ఎటువంటి ఫిర్యాదు ఉన్నా వాట్సప్ ద్వారా సమాచారమిస్తే.. మార్కె...
Oil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌ఫ్యాక్టరీ

Oil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌ఫ్యాక్టరీ

Agriculture
Oil Palm Factory | తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏడాది లోపే రూ. 300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌పరిశ్రమ (Oil Palm Factory) ను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పామ్‌ ఆయిల్ ఉత్పత్తిలో సిద్దిపేట జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.గజ్వేల్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తర దేశాల నుంచి లక్ష కోట్లు పెట్టి పామ్‌ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది.  ఇంకా 11 వేల ఎకరాలకు పెంచాలి. భారత దేశానికి క...
Agri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..

Agri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..

General News
Agri News  | తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాకు రూ.500 బోన‌స్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు. మ‌రోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల మంజూరు కోసం కోసం గైడ్ లైన్స్ రూపొందించేందుకు గాను మంత్రి ఉత్తమ్ కుమార్‌ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సోమ‌వారం సెప్టెంబర్ 16 సచివాలయంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న‌ భేటీ అయిన సబ్ కమిటీ.. రేషన్, హెల్త్ కార్డుల జారీ విధివిధానాలపై చ‌ర్చ‌లు జ‌రిపింది.ఈ స‌మావేశం అనంతరం స‌మావేశంలో తీసుక‌న్న నిర్ణ‌యాల‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాకు వెల్ల‌డించారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్రకటించారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అన్న‌దాత‌ల‌కు ...
Kharif Season | దెబ్బ‌తీసిన వ‌ర్షాలు.. తెలంగాణలో గత ఐదేళ్లలో ఈసారి అత్యల్ప సాగు

Kharif Season | దెబ్బ‌తీసిన వ‌ర్షాలు.. తెలంగాణలో గత ఐదేళ్లలో ఈసారి అత్యల్ప సాగు

Organic Farming
Kharif Season | హైదరాబాద్ : ఈ వనకాలం (ఖరీఫ్) సీజన్‌లో తెలంగాణలో పంటల సాగు తీవ్రంగా ప‌డిపోయింది.మొత్తం పంట విస్తీర్ణం దాదాపు 1.23 కోట్ల ఎకరాలకే పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో 1.29 కోట్ల ఎకరాల సాధారణ విస్తీర్ణంలో 1.28 కోట్ల ఎకరాల్లో సాగు చేశారు. సీజన్ ముగియడానికి ఇంకా రెండు వారాల కంటే తక్కువ సమయం ఉంది. మొత్తం పంట విస్తీర్ణం ఇప్ప‌టికిప్పుడు మెరుగుపడే అవకాశం లేదు.గ‌తేడాది స‌మ‌యానికి పంట‌ల‌కు స‌రిప‌డా సాగునీరు, రైతుబంధు వ్యవసాయ పెట్టుబడి అందడంతో. వ్యవసాయ సాగు వృద్ధికి ఊతమిచ్చింది. గత సంవత్సరాలతో పోల్చినప్పుడు, కోవిడ్ అనంతర కాలంలో వనకాలం సీజన్‌లో ఈసారి అత్యల్పంగా విస్తీర్ణం న‌మోదైంది. సెప్టెంబరు 12 నాటికి 1.23 కోట్ల ఎకరాల్లో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. వనాకాలం సీజన్‌లో సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 1.29 కోట్ల ఎకరాల్లో 95 శాతం ఉండేది. గతేడాది 1.28 కోట్ల ఎకరాల్లో నాట్లు పూర్తికాగా, ఈసారి ప‌ర...
Free Solar Power |  తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!

Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!

E-scooters
Free Solar Power |  సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై  తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది   సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం భట్టి కూడా కీలక ప్రకటన చేశారు. 22 గ్రామాలకు ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా సోలార్ విద్యుత్ అందిస్తామని  వెల్లడించారు. ఫైలట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తోంది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌ కూడా పెరిగిపోతోంది.ఈ క్రమంలో విద్యుత్ కొరత తలెత్తకుండా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న  ప్రభుత్వ భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్...
Palm Oil | పామాయిల్‌ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Palm Oil | పామాయిల్‌ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Organic Farming
Palm Oil | హైదరాబాద్‌ : పామాయిల్‌ రైతులకు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. ఈ పామ్ ఆయిల్‌ రైతులకు ఊరటనిచ్చేలా ముడి పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని పెంచింది. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ‌న్య‌వాదాలు తెలిపారు. దిగుమతి సుంకం పెంపుతో పామాయిల్‌ రైతుల ( Palm Oil Farmers )కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.14,392గా ఉంది. కేంద్రం తాజా నిర్ణ‌యంతో ఇది టన్నుకు రూ.1,500 నుంచి రూ.1,700 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఒక్కో ఆయిల్‌ పామ్‌ గెల ధర రూ.16,500గా పెరగ‌నుంద‌ని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.తెలంగాణ‌ రాష్ట్రంలో ప్రస్తుతం 44,400 ఎకరాల పామ్‌ ఆయిల్‌ తోటలు ఉన్నాయి. ఇం...
TGSRTC Electric Buses | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో రోడ్లపైకి వెయ్యి కొత్త బస్సులు..  ఈ రూట్లలోనే.. ..

TGSRTC Electric Buses | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో రోడ్లపైకి వెయ్యి కొత్త బస్సులు.. ఈ రూట్లలోనే.. ..

General News
TGSRTC Electric Buses |  హైదరాబాద్ : ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) 1,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్డర్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ప్రారంభించిన 13 ఛార్జింగ్ స్టేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దశలవారీగా డెలివరీ చేయబోయే ఈ ఎలక్ట్రిక్ బస్సులు గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ (జిసిసి) మోడల్‌లో పనిచేస్తాయి. ఈ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య మోడల్‌లో ఎలక్ట్రిక్ వాహన సరఫరాదారులకు నిర్వహణ కోసం కిలోమీటరు ప్రాతిపదికన చెల్లింపు ఉంటుంది. వీటిలో 500 కంటే ఎక్కువ బస్సులు సిటీ రూట్లలో సేవలు అందించనున్నాయి. ఈ రూట్లలోనే కొత్త బస్సులు.. TGSRTC Electric Buses : ఎంజీబీఎస్, జేబీఎస్, హెచ్‌సీయూ, హయత్‌నగర్-2, రాణిగంజ్, కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్-2, వరంగల్, సూర్యాపేట, కరీంనగర్-2...
Vanamahotsavam 2024 | తెలంగాణలో వన మహోత్సవం కింద 33,320 మొక్కల పెంపకం..

Vanamahotsavam 2024 | తెలంగాణలో వన మహోత్సవం కింద 33,320 మొక్కల పెంపకం..

General News
తెలంగాణలో ఈ సంవ‌త్స‌రం వ‌న మ‌హోత్స‌వం (Vanamahotsavam)  కింద సుమారు 33,320 మొక్క‌లు నాటాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యం నిర్ధేశించుకుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ నిన్న ఖ‌మ్మం జిల్లా సత్తుపల్లి మండలం గొల్లగూడెంలో వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్‌, ‌సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి మొక్కలు నాటారు. అటవీశాఖ ఆధ్వర్యంలో గొల్లగూడెంలోని అటవీ భూమిలో 33,320 మొక్కలు నాటే కార్యక్రమం మంత్రులు చేపట్టారు. అనంతరం అటవీ ఉత్పత్తుల స్టాల్‌, ‌ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఆఈ సంద‌ర్భంగా మంతి కొండా సురేఖ మాట్లాడుతూ.. 1959లో కేంద్రమంత్రి కేఎం మున్షి వన మహోత్సవానికి (Vanamahotsavam) నాంది పలికారని అన్నారు. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకొని, ప్రతీ జిల్లాకు నిర్దేశిత లక్ష్యాన్ని ఇచ్చిన‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 14,...
Electric Metro Express : హైదరాబాద్ రోడ్లపై కొత్తగా  ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు..

Electric Metro Express : హైదరాబాద్ రోడ్లపై కొత్తగా ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు..

General News
New Electric Metro Express Buses Launching : హైదరాబాద్ వాసులుకు శుభవార్త. రణగొన ధ్వనులు, ఊపిరి సలపని పొగకు కారణమయ్యే డీజిల్ బస్సుల స్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పర్యావరణ హితమైన  ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. TSRTC కొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది.  హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్ (Ponnam Prabhakar), రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( komatireddy Venkatreddy), ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు మంగళవారం జెండా ఊపి ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల స్థానంలో కొత్తగా 500 బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని వారు చెప్పారు. అద్దె ప్రతిపాదికన 500 ఏసీ బస్సులు అద్దె ప్రతిపాదికన  500 ఎయిర్ కండిషన్డ్ బస్సులను  ఆగస్...