
Keesaragutta : ఉత్సాహంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదో ఎడిషన్ ప్రారంభం
Hyderabad : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (జిఐసి) ఎనిమిదో ఎడిషన్‌ను జీఐసీ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. కీసరగుట్ట (Keesaragutta ) లోని రామలింగేశ్వర స్వామి ఆలయం ఆవరణంలోమొక్కలు నాటడం ద్వారా మాజీ ఎంపీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు . వారు కొత్త ఎడిషన్ లోగోను కూడా ఆవిష్కరించారు. నా జీవితాంతం కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించాను" అని సంతోష్ కుమార్ పేర్కొన్నారు,ఏడు సంవత్సరాలుగా ఎంతో ఉత్సాహంగా సాగిన GIC (Green India Challenge), తన ఎనిమిదవ ఎడిషన్‌ను రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించింది. మొదట్లో ఒక వ్యక్తి మూడు మొక్కలు నాటడం.. మరో ముగ్గురు దానిని పునరావృతం చేయడానికి గాను సవాలు చేయడంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఒక హరిత ఉద్యమంగా మారిపోయింది. ఫలితంగా 20 కోట్లకు పైగా మొక...