ఏపీలో ఐదు మోడల్ సోలార్ గ్రామాలు..కార్యాచరణ సిద్ధం..
Vishakhapatnam : ఆంధ్రప్రదేశ్ లో ఎంపిక చేసిన ఐదు గ్రామాలను పూర్తిగా సౌరశక్తితో నడిచే మోడల్ గ్రామాలు (Solar Powered Model Villages)గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రకటించారు. కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాల్లో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. సోలార్ ఇన్‌స్టాలేషన్‌లకు అర్హులైన కుటుంబాలను గుర్తించాలని సూచించారు. అదనంగా, ఆమె గృహ సముదాయాలు, ఆసుపత్రులు, వాణిజ్య ప్రాంతాలలో సోలార్ ప్యానెల్స్ సెటప్‌లను ఏర్పాటు చేాయలని సూచించారు. సోలార్ కంపెనీల నుంచి వారంటీలతో కూడిన అధిక-నాణ్యత గల ఉత్పత్తులను మాత్రమే తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆమె సోలార్ పవర్ యూనిట్లకు సబ్సిడీలు అందించే ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకం (మఫ్ట్ బిజిలీ యోజన) Pradhan Mantri Surya...