Ather Rizta స్కూటర్ కి భారీగా డిమాండ్.. ఎందుకంటే..?
Ather Rizta | భారత విపణిలో సెప్టెంబరు 2024లో మొత్తం 89,940 యూనిట్లు అమ్ముడవడంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ (E2W) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. పరిశ్రమ నివేదికల ప్రకారం, ఈ పండుగ సీజన్‌లో ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ భారీగా ఈవీ స్కూటర్ల అమ్మకాలను నమోదు చేసింది. అక్టోబర్ 30, 2024 నాటికి మొత్తం 20,000 యూనిట్లకు పైగా విక్రయించగా కేవలం అక్టోబర్‌లోనే అత్యధికంగా 20000 యూనిట్లను విక్రయించింది.ఏథర్ నుంచి వచ్చిన కొత్త ఈవీ స్కూటర్, రిజ్టా(Ather Rizta) యూత్, తోపాటు అన్నివర్గాల నుంచి క్రేజ్ సంపాదించుకుంది. ఏథర్ మొత్తం అమ్మకాల్లో ఇప్పుడు రిజ్టాదే అగ్రస్థానం. సెప్టెంబరు 2024లో ఏథర్ మొత్తం దేశీయ డెలివరీలు 16,582 యూనిట్లకు చేరాయి. వాటిలో రిజ్టా విక్రయాలు 9,867 నమోదు చేసింది. ఇది ఏథర్ ఎనర్జీ విజయంలో రిజ్టా స్కూటర్ కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమవుతోంది.అథర్ రిజ్టా: ఎలక్ట్రిక్ టూ-వీలర్ (E2W) సెగ్మ...